నీటిని సంరక్షించుకుందాం


వేసవి వచ్చిందంటే నీటికి కటకటే. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, నీళ్ళురాని బోర్‌లు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే గుక్కెడు నీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడితో జనం అల్లల్లాడతారు. జీవనదులు ఉన్న మన దేశంలో నీటికి కొరత ఏమిటి? అటూఇటుగానైనా ప్రతిఏటా వర్షాలు కురిసే మనకు నీటికి కటకట ఏమిటి?

గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు


దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్‌ సరఫరా అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నం సఫలమైంది. మధ్య మణిపూర్‌ సేనాపతి జిల్లాలో లాయ్‌సాంగ్‌ గ్రామానికి కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వడం పూర్తయింది. దీనితో దేశంలోని వందశాతం గ్రామాలు విద్యుత్‌ పొందడానికి అవకాశం ఏర్పడింది. ఇక ఈ గ్రామా లకు విద్యుత్‌ను సరఫరా చేసే పని మిగిలింది.

హిందూత్వం ఒక్కటే, వేరువేరుకాదు - ఆర్‌ ఎస్‌ ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌

ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారతీయ ప్రతినిధి సమావేశాలు నాగపూర్‌లో జరిగాయి. అందులో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. 'భారతీయ భాషల పరిరక్షణ'గురించి తీర్మానం కూడా ఆమోదించారు. ఈ సందర్భంగా పరమ పూజనీయ సర్‌ సంఘచాలక్‌తో జరిపిన సంభాషణ -

ప్రముఖులు మాట


దేశంలో ప్రతి నిముషం 23 హెక్టార్ల భూమి బంజరుగా మారుతోంది. మన భూభాగంలో 29.32 శాతం అంటే 9.64 కోట్ల హెక్టార్ల భూమి బంజరుగానే ఉంది. ఇది కోతకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.               

 - హర్షవర్ధన్‌, కేంద్ర మంత్రి

అమరవాణి


శ్లో||    అపార భూమీ విస్తారం

    అగణ్య జనసంకులం |

    రాష్ట్రం సంఘటనాహీనం

    ప్రభావేన్నాత్మరక్షణౌ    ||


- సూక్తి సుధ

నారదుడు

నారదుడు బ్రహ్మ మానసపుత్రుడని, త్రిలోక సంచారి అని, నారాయణ భక్తుడని ప్రతీతి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని సంఘటనలు బహుళంగా వస్తాయి. భాగవతం ప్రథమ స్కందంలో నారదుడు వేదవ్యాసునికి భాగవతం రచించమని బోధిస్తాడు. రామాయణం బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమని, అది ఆచంద్రతారార్కం నిలచి ఉంటుందని చెప్తాడు.

మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు (స్ఫూర్తి)


బ్రిటిష్‌ ప్రభుత్వంపై సాయుధపోరాటం చేసిన తెలుగువీరుడు అల్లూరి సీతా రామరాజు. 1897 జూలై 4న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో జన్మించాడు. తండ్రి వెంకట్రామరాజు, తల్లి నారాయణమ్మ.

స్వర్ణ పత్రాలు (హితవచనం)

మన చరిత్రకు చెందిన కాలానికి సంబంధించిన కొన్ని పుటలను ''బంగరు పుట''లని పేర్కొనబోతున్నారు. అందుకు కారణమేమిటి? కొలబద్ధ లేమిటి? అని ప్రశ్నిస్తే ఆ కాలానికి సంబంధించిన చరిత్రల కావ్య, సంగీతాలలోను పౌరుష పరాక్రమాలు, ఐశ్వర్య అధ్యాత్మ్యాలకు చెందిన పుటలలో - పై కొలబద్దకు సరిపోగలవి - అనేక పుటలు దొరుకుతాయి. అవే స్వర్ణపత్రాలు. 

ఆశించకుండా సేవించాలి

మనం ప్రాణివర్గం నుండే కాదు, అప్రాణి వర్గం నుండి లాభాన్ని పొందుతున్నాం. అందువల్లనే వీటి ఋణం తీర్చడం కోసం కొన్ని వైదిక క్రియలను చేస్తున్నాం. జడంగా భావింపబడే భూమికి, నీటికి, అగ్నికి ఋణం తీర్చుకోవాలి.

సమాచారభారతి ఆధ్వర్యంలో నారద జయంతి ఉత్సవాలు


మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా నారదజయంతి ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలో సమాచారభారతి ఆధ్వర్యంలో నల్గొండ, హైదరబాద్‌, మెదక్‌, వరంగల్‌, కరినగర్‌ లలో నారదజయంతి ఉత్సవాలు జరిగాయి.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం


ప్రాచీన వేదకాలం నాటి పద్ధతుల్లో గోవుల ఆధారిత పంటలు పండించినా రాయితీలతో ప్రోత్సహిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ రైతులకు తాజాగా భరోసా ఇచ్చింది. సేంద్రియ వ్యవసాయ అభివద్ధి పథకం (పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన-పీకేవీవై) పథకంలో పలు కీలక మార్పులు చేసిన ముసాయిదాను అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు పంపింది. దీనిపై తెలంగాణ వ్యవసాయ శాఖ బుధవారం తన అభిప్రాయాలను సైతం తెలిపింది. రసాయనాలు లేకుండా సహజ జీవ ఎరువులు, జీవ పురుగుమందులు మాత్రమే వాడుతూ పంటలు పండించాలని ముసాయిదాలో స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు, అభ్యుదయ రైతులు సాగుచేస్తున్న వివిధ రకాల సేంద్రియ పంటల సాగు పద్ధతుల్లో దేనినైనా అనుసరించే స్వేచ్ఛను రైతులకు ఇచ్చింది.

దేవుని దృష్టిలో అందరూ సమానమే


దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సి.యస్‌.రంగరాజన్‌ అన్నారు. జియాగూడలోని చారిత్రత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవను ఆయన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్వయంగా ఓ దళిత భక్తుని తన భుజస్కందాలపై ఎత్తుకుని దేవాలయంలోకి మోసుకెళ్లి శ్రీ రంగనాథుని దివ్యదర్శనం చేయించారు. తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శక్తి స్వరూపిణి మహిళయాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

ప్రకృతి అంతా మాతృ స్వరూపమని తలుస్తూ అన్నింటినీ తల్లిలాగా భావించి పూజించే దేశం మనది. అందుకే గోవును గోమాతగా, మన దేశాన్ని భారతమాతగా, ఇక్కడ నదీ నదాలను గంగామా మాతగా, భూమిని భూమాతగా భావించి పూజిస్తాం. భారతీయ సమాజంలో తల్లి స్థానం చాలా గొప్పది. కానీ నేడు కొన్ని పాశ్చాత్య వింత పోకడల ప్రభావం వల్ల ఆ స్థానానికి ప్రమాదం ఏర్పడిందనే చెప్పవచ్చు. దానికి కారణం భారతీయ సంస్కృతే అని కొందరు విష ప్రచారం చేస్తున్నారు. కానీ మన దేశ సంస్కృతి ఎన్నో దేశాలకు ఆదర్శం. అసలు సమాజంలో ఇటీవల ఆడపిల్లలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తోంది.

నిమ్మకాయ (నిమ్మ ఆకు)

ఇది ప్రతి ఇంటిముందు, లేక తోటలో ఉండే మొక్క. దీనికి పరిచయం అక?రలేదు. అలా అని పట్టించుకోకపోయినా మన ఆరోగ్యానికి ఎంతో నష్టం.

''దళిత్‌'' అనే పదం వాడొద్దు - రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన

అధికారిక లావాదేవీల్లో షెడ్యూల్డ్‌ కులాలకు సంబంధించినవారి గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు 'దళిత్‌' అనే పదాన్ని వాడొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. మార్చి 15న కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఈ లేఖలు పంపింది.

ఆ గ్రామంలో పాలు ఉచితంగా ఇస్తారు

మన గ్రామాల్లో మంచి నీళ్ళడిగితే మజ్జిగ ఇచ్చేవారు. ఏ ఇంటికి వెళ్ళినా లేదనకుండా అన్నం పెట్టేవారు. అలా తమకు ఉన్నది ఇతరులకు పెట్టడం తమ కర్తవ్యమని భావించేవారు. ఆధునికత పెరిగిన తరువాత, ప్రతి విషయాన్ని లాభనష్టాల రూపంలో కొలవడం అలవాటైనప్పటి నుంచి ఈ భావన తగ్గింది. అయినా ఇప్పటికీ గ్రామాల్లో ఇలాంటి సద్భావన అక్కడక్కడ కనిపిస్తునే ఉంటుంది.

సంఘకార్యంపట్ల విశ్వాసం పెరుగుతోంది


దేశం మొత్తం నుండి ఎన్నికైన ప్రతినిధులతో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. వీటిలో దేశం మొత్తంలో సంఘ కార్యం, వివిధ క్షేత్రాలకు సంబంధించిన పని గురించి సమీక్ష జరుగుతుంది. అలాగే దేశానికి సంబంధించిన ప్రధాన అంశాలపై చర్చ, తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది.  ఈ సంవత్సరం ఈ సమావేశాలు నాగపూర్‌లో జరిగాయి.  మా.సర్‌ కార్యవాహ్‌ సురేశ్‌ జోషిజీ వార్షిక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక సారాంశం -

భారతీయ భాషలను పరిరక్షించుకోవాలిరాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానం

భాష ఒక సంస్కృతి, వ్యక్తి, సమాజపు అస్తిత్వానికి, భావ వ్యక్తీకరణకు ప్రధాన వాహకమని అఖిలభారతీయ ప్రతినిధి సభ భావిస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలు, అద్భుతమైన జ్ఞాన సంపద, అపారమైన సాహిత్యాన్ని పరిరక్షించుకోవడంలో, అలాగే సృజనాత్మక ఆలోచనను పెంపొందించడంలో దేశంలోని వివిధ భాషలు, మాండలీకాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనదేశంలో వివిధ భాషలలోని పాటలు, సామెతలు, గిరిజన గీతాలు మొదలైన మౌఖిక జ్ఞాన సంపద లిఖితపూర్వక సాహిత్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

బుద్ధపూర్ణిమ


వైశాఖ మాసంలో గౌతమ బుద్ధుడు జన్మించిన తిథిని బుద్ధపూర్ణిమగా పరిగణిస్తారు. బుద్ధుడు క్రీ.పూ. 563-483 సంవత్సరాల ప్రదేశ్‌లో ఉన్న ''కుసినగర్‌''లో దేహపరిత్యాగం చేశారు. ఆయన జన్మించిన లుంబినితోపాటు, బిహార్‌లోని బుద్ధగయను బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు. బుద్దుడు మొదటి సారి సారనాద్‌లో ధర్మం గురించి బోధించారు. బుద్ధుడు బోధనలతో భారత దేశంతో పాటు, అనేక దేశాలలో ప్రభావితం అయ్యారు. ఈనాటికి చైనా, మంగోళియా, శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలు, జపాన్‌లలో బౌద్ధ మతం అనుసరిస్తున్నారు. 

భగత్‌ సింగ్‌ దేశ భక్తి (స్ఫూర్తి)


1919 ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌ వాలాబాగ్‌ లో  రౌలట్‌ చట్టానికి నిరసన తెలపడం కోసం సమావేశమైన వేలాది ప్రజల మీద జనరల్‌ డయ్యర్‌ మర ఫిరంగులతో కాల్పులు జరిపించాడు. దాదాపు 360మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఆ సంఘటనతో దేశమంతా గగ్గోలెత్తింది.

అనంతమైన జ్ఞానం (హితవచనం)


ప్రాణమున్న శరీరం కేవలం కాళ్ళు, చేతులు, రక్త మాంసాలతో కూడిన సమాహారం కాదు. అనంతమైన దృష్టి, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం కల్గిన ఆత్మకు శరీరం నివాసం. ఆత్మకు సహచరు లెవ్వరూ ఉండరు. ఆత్మ ఒంటిరిగానే వస్తుంది. ఒంటరిగానే వెళ్ళిపోతుంది. అయితే తనను తాను తెలుసుకొనక పోవటం ఆత్మ తప్పిదం.