ఎన్ సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం


5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతీ, పరంపర, జీవన మూల్యాలు వాటి చరిత్రలను ఒక సమగ్ర రూపంలో అందించటానికి ఒక విశేష ప్రయత్నం ఒకటి ఈ మధ్య జరిగింది. 

"ఇండియా హెరిటేజ్ రిసర్చ్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో 2 వేల మంది దేశ విదేశాలలోని ప్రముఖ మేధావులు మూడు సంవత్సరాలు కృషి చేసి సమాచారాన్ని సంకలనం చేసారు. 11 పుస్తకాలుగా, 7086 పేజీలతో  "ఎన్ సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం"  పేరుతో ముద్రించారు. హిందుత్వం అంటే మతం కాదు. ఒక సమగ్ర జీవన విధానము. హిందుత్వం అంటే ఒక జీవన శాస్త్రం. అందులో సామాజిక, ఆర్ధిక, రాజకీయ, నైతిక, సాంస్కృతిక, శాస్త్ర, ధార్మిక అన్ని విషయాలు ఉంటాయి. ఇది ఒక విజ్ఞాన ఖని. ఈ పుస్తకంలో అణు విజ్ఞానం (పురాతనకాలం నుండి భారత్ లో వికసించినది) మొదలు అనేక విషయాలు ఇందులో ప్రస్తావించారు. ప్రపంచంలోని అన్ని భాషలలోని అనేక గ్రంథాలలో హిందుత్వం గురించి ఏమి వ్రాయబడిందో ఇందులో ప్రస్తావించటం జరిగింది. ఈ పుస్తకాన్ని డిల్లీలోని రూప పబ్లిషర్స్ వారు ముద్రించారు. ఈ పుస్తకాల వెల రూ.21,000/-. ఈ విధంగా ఆంగ్లంలో హిందుత్వం గురించి సమగ్రంగా అందించే ఒక ప్రయత్నం జరిగింది.