చక్కని ఆరోగ్యానికి చక్కని దినచర్య


ఆరోగ్యముగా నుండగోరు మానవుడు ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తమున నిదుర మేల్కొనవలెను. ఇచట బ్రాహ్మీముహూర్త మనగా సూర్యోదయమునకు 45 నిముషముల ముందు. నిదుర లేచిన వెంటనే మలమూత్రాదులను విసర్జించవలయును. ఈ రోజున మనం పండ్లను శుభ్రం చేయడానికి అనేక విదేశీ కంపినీల టూత్ పేస్టులను అధిక ధనముతో కొని, విదేశీ కంపెనీలను పోషించటమే గాక దంత సంరక్షణ కూడా సరిగా చేసుకొనలేక పోవుచున్నాము.

దినచర్య : ఆరోగ్యముగా నుండగోరు మానవుడు ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తమున నిదుర మేల్కొనవలెను. ఇచట బ్రాహ్మీముహూర్తమనగా సూర్యోదయమునకు 45 నిముషముల ముందు. నిదుర లేచిన వెంటనే మలమూత్రాదులను విసర్జించవలయును. తదుపరి దంతధావనము చేయవలయును. పండ్లు తోముకొను నిమిత్తము వగరుగా గాని, కారముగా గాని, చేదుగా గాని ఉండు చెట్ల పుల్లలను తీసుకొనవలయును. పండ్ల పుల్లల నిమిత్తము కానుగ, వేప, ఉత్తరేణి, తుమ్మ, మద్ది, ఇప్ప, చండ్ర, మర్రి, పొగడ మొదలగు చెట్ల పుల్లలను చిటికెనవేలు మందము, 6 నుండి 8 అంగుళముల పొడవు గల వానిని తీసుకొని చివర నలగగొట్టి గాని, నమిలి గాని మెత్తగా కుంచెగా చేసి ప్రతి పంటిని జాగ్రత్తగా చిగుళ్ళకు బాధ కలుగనీయకుండా పైన చెప్పబడిన చెట్ల బెరడుల మెత్తడి పొడితో శుభ్రము చేయవలెను. ప్రతి దంతాన్ని జాగ్రత్తగా మెత్తటి కూర్చంతో చిగుళ్ళకు బాధ కలుగనీయకుండా జాగ్రత్తగా శుభ్రము చేయవలెను. ఆయుర్వేదంలో కొన్నివేల సంవత్సరాల క్రితం చెప్పిన దంతధావన విధి, అందుకు వాడే చెట్ల పుల్లలను ఇప్పటికీ శాస్త్రీయంగా దంత సంరక్షకాలుగా పరిగణిస్తున్నారు. 


ఈ రోజున మనం పండ్లను శుభ్రం చేయడానికి అనేక విదేశీ కంపినీల టూత్ పేస్టులను అధిక ధనముతో కొని, విదేశీ కంపెనీలను పోషించటమే గాక దంత సంరక్షణ కూడా సరిగా చేసుకొనలేక పోవుచున్నాము. మనదేశంలో మనకు అందుబాటులో వేప మొక్క, ఇంకా అనేక మూలికలు కలవు. తాజాగా లభించు ఆ మూలికల పుల్లలతో గాని, లేక బెరడును మెత్తగా మృదువుగా పొడిచేసి అందులో కొద్దిగా కర్పూరం, లవంగములు, జాజికాయల మెత్తటి చూర్ణము కలిపి ఆ పొడితో పండ్లను తోముకొనవలయును. దంత ధావన తరువాత 10 అంగుళాల పొడవు గల వంపు కలిగిన పదను లేని ఏదేని లోహపు బద్దతో నాలుక శుభ్రం చేసుకోనవలయునని చెప్పబడినది. ఈ నాలుక శుభ్రము చేయు విధానము ప్రాచీన కాలమందే ఆయుర్వేదములో చెప్పబడింది. తదుపరి సుగంధ ద్రవ్యములతో తయారు చేయబడిన నీటితో నోటిని పలుమార్లు పుక్కిలించి నోటిని శుభ్రం చేయాలి. దీనిని గండూష విధి అంటారు. దీనివలన నోటి శుద్ధి జరిగి దుర్వాసన లేకయుండును.  

- దినచర్య తరువాయి భాగం వచ్చే సంచికలో..

 డా.పి.బి.ఏ.వేంకటాచార్య