ఆగస్టు 21 నాడు భాగ్య నగరులో 'బాలగోకులం''బాలగోకులం - భాగ్యనగర్' వారి అధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణుడి జన్మ తిథి అయిన శ్రీ కృష్ణాష్టమి రోజున బాలగోకులం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బాల బాలికలు శ్రీ కృష్ణ వేషధారణతో అలంకరించుకుని తమ చిన్ని చిన్ని నవ్వులు  ఒలకబోస్తూ ఆనందంగా పాల్గొంటారు.

అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 21  నాడు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఆ రోజున 'బాలగోకులం - భాగ్యనగర్' వారి అధ్వర్యంలో బాలగోకులం కార్యక్రమం జరగబోతోంది. ఈ  కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సమాపన సమ్మేళనం, భాగవత పారాయణం, అలాగే బాలల శ్రీ కృష్ణ వేషధారణ ప్రదర్శన మొదలైన వివిధ కార్యక్రమాలుంటాయి. 

ఈ బాలగోకులం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తమ చిన్నారులకూ రావాలనుకునే తల్లిదండ్రులు ఈ క్రింది నంబరుకు ఫోన్ చేసి ఇతర వివరాలు కనుక్కోవచ్చు.

9866990342 , 9989826950 .