డా.ఫాయ్ అమెరికాలో పాకిస్తాన్ గూడచారా?


అమెరికాలో ఉంటూ అమెరికా చట్టాలకు విరుద్ధంగా పాకిస్తాన్ గూడచారి సంస్థ అయిన ఐ.ఎస్.ఐ.కి పెయిడ్ ఏజెంట్ గా పనిచేస్తున్న డా.గులాం నభీ ఫాయ్ ను గతవారం అమెరికా ఫెడరల్ బ్యూరో (ఎఫ్.బి.ఐ.)
వర్జీనియాలో తన అదుపులోకి తీసుకొంది. కాశ్మీర్ సమస్యపై అమెరికన్ కాంగ్రెస్ ను స్థానిక పోలీసులను ప్రభావితం చేస్తున్నాడనే ఆరోపణపై నిర్బంధించింది. అమెరికా కోర్టు జులై 27 న షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఫాయ్ ని గృహ నిర్బంధం లో ఉంచాలని ఆదేశించింది. బెయిల్ ఇచ్చినట్లు ప్రకటన వెలువడిన తరువాత ఆయన భార్య ఫాయ్ మద్దతుదార్లను ఉద్దేశించి ప్రసంగించింది. "కాశ్మీరి ప్రజలకు" న్యాయం జరగాలని భగవంతుడ్ని ప్రార్థించండి అని ఫాయ్ మద్దతుదారులకు పిలుపునిచ్చింది. అమెరికా నేరపరిశోధన సంస్థ నిర్బంధించి కోర్టు ఆదేశంతో గృహ నిర్బంధం ఎదుర్కొంటున్న ఫాయ్ ఎవరు?

ఈ ఫాయ్ కాశ్మీర్ వాసి. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు దగ్గరలో ఉన్న వాధ్వా గ్రామంలో జన్మించాడు. డిగ్రీ వరకు శ్రీనగర్లో చదువుకున్నాడు. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ లో ఏం.ఏ. డిగ్రీ పొందాడు. పెన్సిల్వేనియాలోని టెంపెన్ విశ్వవిద్యాలయం నుండి "మాస్ కమునికేషన్స్"లో డాక్టరేట్ పొందాడు.  ఐ.ఎస్.ఐ.   ఏజెంటు గా   గడచిన 20 సంవత్సరాల  నుండి అమెరికాలో ఉంటూ పని చేస్తున్నాడు.

అమెరికాలో ఉంటూ ఏమి చేస్తున్నాడు? 
ఐ.ఎస్.ఐ. అడుగుజాడలలో మేధావివర్గం లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ అనుకూల కాశ్మీరి విధానాన్ని ప్రచారం చేస్తున్నాడు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను, భారత దేశంలోని ప్రముఖ మేధావులను ప్రభావితం చేస్తున్నాడు. ఫాయ్ చేతిలో అనేక సంస్థలు ఉన్నాయి. 40 కి పైగా దేశాలలో సదస్సులు నిర్వహించాడు. భారతీయ మేధావులతో కాశ్మీర్ సమస్యపై మాట్లాడిస్తూ "కాశ్మీర్ కు అన్యాయం జరుగుతోంది. కాశ్మీర్ భారత్ నుండి విడిపోవడమే న్యాయ సమ్మతం అనిపించాలని" అతని ఉద్దేశ్యం. 
ఉదాహరణకు 2010 జూలై 29, 30 తేదిలలో ఫాయ్ చే స్థాపించబడిన కాశ్మీర్-అమెరికన్ కౌన్సిల్ సంస్థ అధ్వర్యంలో ఒక సెమినార్ నిర్వహించబడింది. ఈ సెమినార్ లో పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహాలోదా, కులదీప్నయ్యర్, రాజేంద్ర సచార్, షరిందర్ బవేజా, గౌతమ్ నవల ఖాలే మొదలైనవారు పాల్గొన్నారు. ఆ సెమినార్లో ఆమోదించిన తీర్మాన రూపకల్పనలో మన భారతీయులను ఉపయోగించుకున్నారు. ఆ తీర్మానం లో "కాశ్మీర్ లో రోజు రొజుకూ మనవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని, కాశ్మీర్ జనావాసాల నుంచి భారతీయ సైన్యాలను ఉపసంహరించాలని, కాశ్మీర్ లో విచక్షణా రహితంగా జరుగుతున్నా నరమేధం గురుంచి విచారణ జరిపేందుకు ఒక పక్షపాత రహిత కమిషన్ ను నియమించవలసిందిగా కూడా కోరటమైనది. ఈ విధంగా అనేక సంవత్సరాల నుండి సెమినార్ లు, కార్యక్రమాలు నిర్వహిస్తూ కాశ్మీర్ ను భారత్ నుండి వేరు చేసేందుకు అనుకూలంగా తీర్మానాలు చేయిస్తున్నాడు. ఆమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాడు. డా.ఫాయ్ భారతీయ మేధావులను తన ఖర్చులతో కార్యక్రమాలకు పిలవటమే కాదు, పైకొద్ది పారితోషికాలు ఇచ్చి వాళ్ళను మెప్పించి కాశ్మీర్ పై పాకిస్తాన్ కు అనుకూలంగా గళం వినిపింపచేస్తున్నాడు.

ఫాయ్ తో  సంబంధాలున్న ప్రముఖులెవరు? 
1 ) జస్టిస్ రాజేంద్ర సచార్ (ముస్లిం బాగోగుల గురించి రూపొందించిన సచార్ కమిటి నివేదిక రూపకర్త), 2 ) దిలీప్ పడగొంకర్ (టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ సంపాదకులు, కాశ్మీర్ సమస్యపై ప్రధాని నియమించిన త్రిసభ్య కమిటీలో ఒకరు), 3 ) కులదీప్ నయ్యర్ (పత్రిక రచయితా, బ్రిటన్ మాజీ దౌత్యాధికారి), 4 ) హరిషఖర్ (ప్రధాని మీడియా సలహాదారు), 5 ) రీటామన్ చందా (భారత్-పాకిస్తాన్ మహిళా సంస్థ సభ్యురాలు), 6 ) వేదభాసిక (ఎడిటర్, కాశ్మీర్ టైమ్స్), 7 ) హరిందర్ బవేజ (ఎడిటర్, ఇన్వెస్టిగేటివ్ హెడ్ లైన్స్ టుడే), 8 ) గౌతమ్ నరలభ (ఎకనామిక్ ది పొలిటికల్ వీక్లీ సంపాదకుడు), 9 ) కమల్ చినాయ్ (మనవ హక్కుల సంఘ కార్యకర్త), 10 ) అరుంధతి రాయ్ (రచయిత్రి), 11 ) ప్రఫుల్ల బిద్వాయ్ (కాలమిస్టు) మొదలైన వారు.


ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉన్నత పదవులలో ఉన్నవారు. ఈ ఇద్దరినీ ప్రభుత్వం ఏం చేస్తుందో?


చివరగా ఒక మాట : భారత గూడచారి సంస్థలు ఫాయ్ ని ఇంతవరకు పాకిస్తాన్ గూడచారిగా గుర్తించనేలేదు. మన ప్రధాని అతిగా ప్రేమించే, విశ్వసించే అమెరికా పరిశోధనా సంస్థ ఫాయ్ ని పాకిస్తాన్ గుడచారిగా గుర్తించింది. భారత్ ఏమి చేస్తుంది? ఏ చర్యలు చేపడుతుంది? వేచి చూడాలి.