మనం మరచిన కుంకుడుకాయ

కుంకుడుకాయ నురుగుతో తలంటుకోవటం వలన చుండ్రు తగ్గి, తల వెంట్రుకలు వత్తుగా, నల్లగా పెరుగుతాయి. షాంపు, సబ్బులు మొదలైన వాటికన్నా తలంటుకు కుంకుడు నురుగు శ్రేష్టమైనది. తేలు కటుపై కుంకుడుకాయ రసం రాసిన విషం విరిగి బాధ తగ్గుతుంది. కుమ్కుడును తేనెతో ఆరగతీసి నాకిస్తే కఫము బయటకు వచ్చి ఆయాసం తగ్గుతుంది.

కుంకుడు : వేడి చేస్తుంది. గర్భ పాతనము చేయును. వాంతిని కలిగిస్తుంది. శరీరమును సన్నబదేటట్టు చేస్తుంది. చర్మ వ్యాధులను  తగ్గిస్తుంది. విషహరము. ఉబ్బసమును తగ్గిస్తుంది.  సుఖ విరేచనమును చేయును. తల నొప్పిని తగ్గిస్తుంది. ఒంటి కణత నొప్పికి కుంకుడు పండు నురుగును పాలలో కలిపి మూడు చుక్కలు ముక్కులో వేసిన ఒంటి కణత నొప్పి తగ్గును. ఇది జీర్ణమైనది. ముక్కులలో మంట పుట్టించును. జాగ్రత్తగా వాడవలయును. తల నొప్పియందు కుంకుడు ఆకును మెత్తగా దంచి నూనెలో వేయించి గోరు వెచ్చగా తలకు పట్టీ వేసిన తల నొప్పి తగ్గును. చంటి బిడ్డలలో కలుగు మలబద్దకంలో కుంకుడు పండును గంధంగా తీసి సన్నని పొగాకు కాడతో గాని లేదా చింతపండు కాడతో గానీ ఆ గంధాన్ని రాసి ముడ్దిలోనికి 1 అంగుళము లోపలి పెట్టిన వెంటనే విరేచనమగును. మూర్చలలో కుంకుడు గుజ్జును మూర్చ వచ్చినప్పుడు నోటిలో 5 లేక 6 చుక్కలు వేసిన తెలివి వచ్చును. తేలు కాటుపై కుంకుడుకాయ రసం రాసిన విషం విరిగి బాధ తగ్గుతుంది. కుంకుడుకాయ నురుగుతో తలంటుకోవడం వలన చుండ్రు తగ్గి తల వెంట్రుకలు వత్తుగా, నల్లగా పెరుగుతాయి. షాంపు, సబ్బులు మొదలైన వాటి కన్నా కుంకుడు నురుగు శ్రేష్టమైనది.   


గమనిక : వచ్చే మాసంలో ఉసిరి పండు గుణములను గురించి తెలుపబడును. ఉసిరి పండు అమృత ఫలం వంటిదని దేవతలు కూడా చెప్పుకుంటారు. మన నిత్య జీవితంలో ముసలి తనంతో పాటు ఇతర అనేక రోగాలను రాకుండా నివారించే ఉసిరిక పండు గురించి తప్పక చదివి తెలుసుకొని, పాటించి మీ ఆరోగ్యాన్ని పెంపొందిన్చుకోగలరు.

డా.పి.బి.ఏ.వేంకటాచార్య