సికింద్రాబాద్ లో లోక హితం పాఠకుల సదస్సు

ఆగస్టు 21 వ తేదీన సికింద్రాబాద్ లోని గీతామందిర్ లో ఆ నగరానికి చెందిన 'లోక హితం' పాఠకుల సదస్సు జరిగింది.
ఈ సదస్సులో సికింద్రాబాద్ ప్రచార ప్రాముఖ్ శ్రీ కాపర్ల వెంకటేశ్వర్లు, లోక హితం పత్రిక సంపాదకులు శ్రీ ఆర్.మల్లికార్జున రావు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో పాఠకులు పత్రికకు సంబంధించిన తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

శ్రీ పరశురాం అనే పాఠకుడు పత్రకలో వస్తున్న 'మన చరిత్రను తెలుసుకుందాం' వ్యాసం బాగుందని చెపుతూ "ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వీరుల చరిత్రలు కూడా ప్రచురిస్తే బాగుంటుంది" అని సూచించారు. "చిన్న పిల్లలకు, యువకులకు నైతిక విలువలకు సంబంధించిన అంశాలను తెలియ చేసేందుకు రామాయణం, భారతం లోని కొన్ని సంఘటనలు ప్రచురిస్తే బాగుంటుందని" శ్రీమతి వసంత గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యెన్.ఏ.సి. (నేషనల్ అడ్వైజరీ కమిటి) పార్లమెంటుకు పంపించిన మత హింస నిరోధక బిల్లు గురించి కుడా ఈ సదస్సులో చర్చకు వచ్చింది.

కార్యక్రమం చివరలో సంపాదకులు ఆర్.మల్లికార్జున రావు మాట్లాడుతూ - పాఠకులు సూచించిన అంశాలను సంపాదక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు.