చైనా బుల్లెట్ ట్రైన్ ప్రహసనం

క్రిందటి నెల చైనా ఒక బుల్లెట్ ట్రెయిన్ ను మొదటిసారిగా ప్రవేశపెట్టింది. బీజింగ్ - షాంఘై మధ్య గల 300 కిలోమీటర్ల దూరం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఈ రైలును ప్రయోగాత్మకంగా నడిపి చూసింది. సాంకేతికంగా తన ఆధిక్యతను చాటుకొనే దిశలో ప్రచారం కూడా నిర్వహించింది. ఐతే! ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో రెండు బుల్లెట్ ట్రెయిన్లు ఒక ఎత్తైన వంతెనమీది నుండి క్రింద పడ్డాయి. చైనా ప్రకటన ప్రకారం 35 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఐతే అభిజ్ఞవర్గాల కథనం ప్రకారం మరణాలు వందలలో ఉండవచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా బుల్లెట్ ట్రెయిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ వద్ద నుండి చైనా దొంగిలించిందని జపాన్ ఆరోపిస్తుండడం కొసమెరుపు.   
- ధర్మపాలుడు