వరంగల్ మహానగరంలో లోకహితం పాఠకుల సమావేశం

సెప్టెంబర్ 18 న వరంగల్ మహానగరంలో డాక్టర్స్ కాలనీ ఫేజ్-2 లో లోకహితం పాఠకుల సమావేశం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జేష్ఠ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా లోకహితం పత్రిక సంపాదకులు శ్రీ మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 30 మంది పాఠకులు  పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు శ్రీ రఘురాం మాట్లాడుతూ "హిందూ సంస్కృతిని కాపాడే ఒక ప్రక్రియ లోకహితం పత్రిక" అన్నారు. హిందూ సమాజానికి ఎదురవుతున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళటం స్వాగతించదగిన అంశంగా పేర్కొన్నారు.  
డాక్టర్స్ కాలనీ అధ్యక్షుడు శ్రీ వీరస్వామి మాట్లాడుతూ లోకహితం పత్రికలో వస్తున్న వ్యాసాలు ఆలోచించతగ్గవిగా ఉన్నాయని అన్నారు. శ్రీ సోమనాథం మాట్లాడుతూ పెచ్చు మీరుతున్న హింసాయుత ధోరణులు తగ్గించే విధంగా పత్రిక వ్యాసాలు, వార్తలు వస్తే బాగుంటుందని అన్నారు. శ్రీ రేవా కోటేశ్వరరావు మాట్లాడుతూ "పత్రికకు చందాదారులను పెంచేందుకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.  
లోకహితం సంపాదకులు శ్రీ మల్లికార్జున్ మాట్లాడుతూ "జాతీయ భావాలను పటిష్టం చేసేందుకు ఈ పత్రికను ప్రారంభించమని అన్నారు. దేశంలో దినపత్రికలు, వారపత్రికలు చాలా ఉన్నాయి. చాలా వార్తలు మనకు వాటి ద్వారా తెలుస్తున్నాయి. కాని ఆ పత్రికలు మన సంస్కృతి పరిరక్షణకు, దేశ ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించటంలో అంతగా పట్టించుకోని పరిస్థితులలో ఈ పత్రిక ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 2014 స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్భంగా దేశ సమగ్రాభివృద్ధికి దేశ పటిష్టతకు వివేకానంద ఇచ్చిన పిలుపును పాఠకులకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనాయి అని అన్నారు. చివరగా జాతీయ గీతంతో పాఠకుల సమావేశం ముగిసింది.
- లక్ష్మణ్ సుధాకర్