వంటింటి వైద్యశిఖామణి - వెల్లుల్లి

మాంసాహారం మరియు ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో  ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. 

వెల్లుల్లి (లశున) : ఆయుర్వేదములో వెల్లుల్లి రసాయనముగా చెప్పబడినది. పక్షవాతము మొదలుకొని కుష్ఠు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జ్వరము, జీర్ణాశయ  వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధం లేదు. వెల్లుల్లి అత్యుత్తమమైన జీర్ణకారిగా పని చేస్తుంది. ప్రధానంగా మాంసాహారం మరియు ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పనిసరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. గుండె జబ్బులు కలవారు బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు చిన్నపాయలను తీసుకుంటే లావు తగ్గుతారు. స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. ఋతు దోషములను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన ఆస్త్మా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. చర్మ వ్యాధులను తగ్గించి, చర్మానికి కాంతిని కలిగిస్తుంది. వెల్లుల్లిపాయలను దంచి ఆ రసాన్ని 10  చుక్కల చొప్పున రోజుకి రెండు సార్లు త్రాగించిన కోరింత దగ్గు తగ్గుతుంది. పక్షవాతం, ఆర్జితవాతం (ముఖం వంకర పోవుట), కీళ్ళవాతం లలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. శుక్రవృద్ధికారి. చెవిపోటు తగ్గుతుంది.  

గమనిక : వెల్లుల్లి అతిగా తింటే రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు రావచ్చును. కాబట్టి తగు మోతాదులో జాగ్రత్తగా సేవిస్తే అమృతముగా పని చేస్తుంది. ఉష్ణ తత్వము కలిగిన వారు, సుకుమారులు, వెల్లుల్లిని సేవించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

డా.పి.బి.ఏ.వేంకటాచార్య