ఇదేమి ప్రజాసేవ ?

తాడిత పీడిత పేద గిరిజనుల సేవ కోసం అహరహం శ్రమిస్తామని చెప్పుకొనే మావోయిస్టుల చర్య ఆశ్చర్య గొలిపేలా ఉంది. 


విశాఖ అటవీ ప్రాంతంలో మాధవరావు అనే ఫారెస్టు రేంజరును  హత్య చేసి ఇంకా రక్తం తడి ఆరకముందే ఏజన్సీలో కంప మనుపాకలు అనే గిరిజనుల గ్రామంలో ఆకలి పేదరికంలో మ్రగ్గుతున్న ప్రజలకు పంపిణీ చేయబడిన సహాయక సామగ్రిని మావోయిస్టులు నిర్దాక్షిణ్యంగా తగులబెట్టారు. అంతకుముందు పోలీసువారు పంచిపెట్టి వెళ్ళిన చీరలు, దుస్తులు, గొడుగులు, వంట సామాను, గృహోపకరణాలు, బియ్యం, పప్పు మొదలైన వాటన్నిటిని గ్రామస్తుల నుండి గుంజుకొని కుప్ప పోసి మరీ తగులబెట్టారు. ఇదేమి సేవో అర్ధం కాదు
టైమ్స్ ఆఫ్ ఇండియా, 30.9.11, పుట 10
-ధర్మపాలుడు