ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ఆరోగ్య భారతి లక్ష్యం

"ఆరోగ్యమే మహాభాగ్యం"  అన్నది అనాదిగా వస్తున్న సూక్తి. మన దేశంలో నేడు ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, యోగ, ప్రకృతి, యునాని, హోమియోపతి, అలోపతి మొదలైన వైద్య పద్ధతుల ద్వారా రోగ చికిత్స పైన విశేషమైన కృషి జరుగుతున్నది. 


ఆరోగ్యమంటే కేవలం రోగం లేకపోవటం మాత్రమే కాదు. శారీరిక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మికంగా వ్యక్తి వికసించడమే నిజమైన ఆరోగ్యం. ఈ దిశలో దృష్టి సారించి పని చేస్తున్న సంస్థ ఆరోగ్య భారతి.  

ఆరోగ్య భారతి ఉద్దేశ్యం
మనదేశానికి వారసత్వంగా లభించిన ప్రాచీన వైద్య విజ్ఞాన సంపద నుండి ప్రేరణ పొందుతూ, మన దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు పని చేస్తున్న సంస్థ 'ఆరోగ్య భారతి'. దేశంలో ప్రస్తుతం ఉన్న వివిధ చికిత్సా పద్ధతులను సమన్వయ పరుస్తూ, సమాజంలోని, చిట్టచివరి వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడుగా ఉండేట్లు చూడటమే ఆరోగ్య భారతి ఉద్దేశ్యం. ఆరోగ్య విజ్ఞానం ద్వారా జాగృతి కలిగిస్తూ, ప్రజలకు రోగ నిరోధక పద్ధతుల పట్ల అవగాహన కలిగిస్తూ, వైద్య సౌకర్యాలు లభింపచేయడం అవసరం.  ఈ దృష్ట్యా ఆలోచించి పవిత్ర దినమైన కార్తీక బహుళ త్రయోదశి (యుగాబ్ది 5014 ) 'శ్రీ ధన్వంతరి జయంతి' నాడు కేరళలోని కొచ్చిలో ఆరోగ్య భారతి స్థాపించబడింది. మరియు 29 జూలై 2004 న భోపాల్ లో 'ఆరోగ్య భారతి లోక్ న్యాస్' పేరిట రిజిస్టర్ చేయబడింది.   

నిలోఫర్ ఆసుపత్రి ద్వారా భాగ్యనగర్ సీతారాంబాగ్ లో పాఠశాలను దత్తత తీసుకుంటున్న చిత్రం

ఆరోగ్య భారతి కార్య స్వరూపం
ఆరోగ్యవంతమైన వ్యక్తి, ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, తద్వారా ఆరోగ్యవంతమైన భారతం - ఈ లక్ష్యాలన్నీ చేరడానికి ఆరోగ్య భారతి అనేక మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో...
వరంగల్ జిల్లా చిట్యాల గ్రామంలో బాలబాలికలకు ఆరోగ్య పర్రీక్షలు జరుపుతున్న ఆరోగ్యభారతి కార్యకర్తలు
  • పాటశాల బాలబాలికల సమగ్ర ఆరోగ్యం
  • తల్లులకు 'గృహవైద్యం', యువతకు 'ప్రథమ చికిత్స' పద్ధతుల్లో శిక్షణ,
  • అందరికీ భారతీయ ఆరోగ్యజీవన శైలి ప్రబోధన,
  • పరంపరానుగతంగా వస్తున్న దేశీయ చికిత్సా పద్ధతుల శాస్త్రీయ విశ్లేషణ మరియు ప్రోత్సాహం,
  • ప్రతి గ్రామంలో 'ఆరోగ్య మిత్ర' ఎంపిక మరియు ప్రశిక్షణ,
  • అన్ని వైద్య విధానాల సమన్వయ చికిత్స (హాలిస్టిక్ ట్రీట్ మెంట్),
  • వైద్య విద్యార్ధులకు ఆరోగ్య సేవాకార్యక్రమాలు జోడించుట.   
పిల్లల ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమం
ప్రస్తుతం మనదేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 2 లేక 3 గ్రామాలలోని ప్రభుత్వ ఉన్నత పాటశాల లలో ఈ కార్యక్రమం నమునాగా ప్రవేశింప బడుతున్నది. పాటశాల లను విద్య శాలలు దత్తత తీసుకొని పని చేస్తున్నాయి. సంఘ శాఖలు సరేసరి. ముందు రోజులలో ప్రతి ఊరి దేవాలయం ఒక పాటశాలను దత్తత తీసుకొని పని చేయాలి. ఈ క్రమములో ఏ సేవా సంస్థ అయినా ముందుకు రావచ్చును. 

పస్చిమాంధ్ర ప్రాంతములో సుమారు 10 వైద్య కళాశాలలు ఈ పనిలో ఉన్నాయి. ఆరోగ్య సేవా కార్యము సుమారు 500  మంది డాక్టర్లను, 1000 మంది వైద్య విద్యార్థులను, 10000 మంది బాల బాలికలను ప్రభావితం చేసింది.

భాగ్యనగరములోని అనేక సేవా బస్తీలకు (మురికి వదలకు) వందలాది మంది డాక్టర్లు, విద్య విద్యార్థులు ఆరోగ్య సేవలందించారు. అనేక గ్రామాలకు, వనవాసీ బంధువుల వద్దకు వెడుతున్నారు.
ప్రముఖ వైద్య సంస్థలైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, హోమియో, ఆయుర్వేద - మొదలైనవి ఒక్కొక్క  పాటశాలను దత్తత తీసుకుని సమగ్ర ఆరోగ్య సేవలందిస్తున్నాయి. 


ఆరోగ్య భారతి ద్వారా దత్తత తీసుకున్న పాటశాల విద్యార్ధుల ఆరోగ్యం, సంస్కారాలతో పాటు వారి చదువుకూడా మెరుగుపడింది. పాటశాల యుట్టీర్నిత గతం కన్నా 10 % పెరిగింది.
ఇలా ఆరోగ్య రంగంలో మార్పు తెచ్చే పనిచేస్తున్నది ఆరోగ్య భారతి. ప్రతి వ్యక్తీ ఆరోగ్యంగా ఉంటే సమాజం వికాసం చెందుతుంది అనేది వివేకానందుని ఆలోచన.  ఈ ఆలోచనను కార్యాచరణలో చుపిన్స్తున్నది ఆరోగ్య భారతి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. 


1 . "ధర్మార్థ కామ్మోక్షానా - మారోగ్య మూలముత్తమమ్"
2 . "శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనమ్"
3 . "సర్వేసంతు నిరామయా"
 


వైద్య కళాశాలలలో వస్తున్న మార్పులు 

ప్రతి ఏటా జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి) పురస్కరించుకుని స్వమిజే యొక్క నిలువెత్తు చిత్రపటం ఒక వైద్య సంస్థలో ఆవిష్కరించా బడుతున్నది. ఇప్పటి వరకు 12 వైద్య సంస్థల్లో ఈ కార్యక్రమం పూర్తి అయింది.

స్వామి వివేకానందుని  కాంస్య విగ్రహాలు ఉస్మానియా, గాందీలలో నెలకొల్పబడ్డాయి.

ఉస్మానియా వైద్య కళాశాల బాలుర వసతి గృహాలకు చరక, సుశ్రుతుల పేరిట నామకరణం జరిగింది. వీనిలో చాల పెద్ద చిత్రపటంతో చరక శపథం పెట్టబడింది. 

గాంధీ వైద్య కల శాల పీజీ సెంటర్ ను 'ప్రజ్ఞానామ్ బ్రహ్మ - శ్రీ ధన్వంతరి' అని నామకరణం చేశారు.


లక్ష్యాలు

ఆరోగ్యమైన భారతిలో జాతీయ ఆరోగ్య దినం శ్రీ ధన్వంతరి జయంతి ఉండాలి. దీనికి ప్రతి ఏట వైద్య సంస్థలలో శ్రీ ధన్వంతరి జయంతి జరుపబడుతున్నది. 

ఆరోగ్య చిహ్నంగా స్వస్తిక్ ఉండాలి. దీనికి విస్తృత ప్రచారం జరుగుతున్నది. అనేక మంది వైద్య విద్యార్థులు, వైద్యులు 'రెడ్ క్రాస్' చిహ్నం స్థానంలో 'స్వస్తిక్' ను వాడుతున్నారు. దీనికి స్టిక్కర్ల పంపిణీ జరుగుతున్నది. 

సేవా భావంతో, ఆరోగ్య జగరణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను, సమాజంలోని చిట్టా చివరి వ్యక్తికి దేశంలోని అన్ని గ్రామాలకు చేరవేసే వ్యక్ర్తియే "ఆరోగ్యమిత్ర".

2014 నాటికి ఇటివంటి  'ఆరోగ్య మిత్ర'లు మరో 5000  నిర్మాణం చేయాలనేది ఆరోగ్య భారతి లక్ష్యం.