అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకలు

శ్వేత సౌధంలో దీపాన్ని వెలిగించి దీపావళి వేడుకలు ప్రారంభిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేత సౌధంలో దీపాన్ని వెలిగించి శుక్రవారం రాత్రి దీపావళి వేడుకలు ప్రారంభించారు. చీకటిపై వెలుగు గెలుపు, నిరాశపై ఆశ గెలుపు సాధించే పర్వదినంగా ఒబామా దీపావళిని అభివర్ణించాడు. గత సంవత్సరం తాను దీపావళి పండుగను భారత్ లో జరుపుకున్నట్లు గుర్తు చేసుకున్న అయన హిందువులకు, జైనులకు, సిక్కులకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. 
-ధర్మపాలుడు