మూలశంకకు మందు ఉత్తరేణి

ఉత్తరేణి ఆకు రసమును తేనెతో కలిపి నోటిలోకి తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఉత్తరేణి ఆకుల రసాన్ని జొన్న జావతో కలిపి త్రాగిస్తే మూత్రం జారీ అవుతుంది. ఉత్తరేణి వెన్నులు (ఈనెలు) పొగ వేస్తె తేలు విషం తగ్గుతుంది. ఉత్తరేణి వ్రేళ్ళ బూడిదను ముద్దగా చేసి కుంకుడుకాయంత మజ్జిగలో కలిపి ఇచ్చిన కామెర్లు తగ్గుతాయి. 

ఉత్తరేణు :  ప్రతి గ్రామంలోను దొరికే మూలిక ఉత్తరేణు. కఫ, వాతహరముగా పని చేస్తుంది. వేడి చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. జీర్ణకారి. శరీరములో క్రొవ్వును కరిగిస్తుంది. కడుపుబ్బరమును తగ్గిస్తుంది. మూలశంకను పోగొడుతుంది. నులి పురుగులను నశింప చేస్తుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది. క్లైబ్యమును పోగొడుతుంది. వీర్య వృద్ధిని కలిగిస్తుంది.

ఉత్తరేణి వేరు ముద్దగా నూరి తేనె, బియ్యం కడిగిన నీటితో ఇచ్చిన మూలశంక తగ్గుతుంది. మూలశంక వ్యాధియందు రక్తస్రావం ఎక్కువగా ఉంటే ఉత్తరేణి గింజలు ముద్దగా నూరి బియ్యం కడిగిన నీటితో ఇవ్వాలి.

ఉత్తరేణి ఆకు రసమును తేనెతో కలిపి నోటిలోకి తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఉత్తరేణి ఆకుల రసాన్ని జొన్న జావతో కలిపి త్రాగిస్తే మూత్రం జారీ అవుతుంది. ఉత్తరేణి వెన్నులు (ఈనెలు) పొగ వేస్తె తేలు విషం తగ్గుతుంది. 

ఉత్తరేణి ఈనెలు, చక్కెర కలిపి ఇస్తే పిచ్చి కుక్క విషం తగ్గుతుంది. కందిరీగలు, తేనెటీగలు కుట్టినందువల్ల వచ్చిన మంట, దద్దులు ఉత్తరేణి ఆకు రసం రాసిన తగ్గుతాయి.

ఉత్తరేణి వెన్నులు (ఈనెలు) పొగ వేస్తె తేలు విషం తగ్గుతుంది. ఉత్తరేణి వ్రేళ్ళ బూడిదను ముద్దగా చేసి కుంకుడుకాయంత మజ్జిగలో కలిపి ఇచ్చిన కామెర్లు తగ్గుతాయి.

ఉత్తరేణి చెట్టు మొత్తం కాల్చి బూడిద చేసి ఆ బూడిదను నీటిలో కలిపి తేరుస్తూ ఎండబెట్టిన తయారయ్యే పొడిని "అపామార్గ క్షారము" అందురు. ఈ
అపామార్గ క్షారము ఒక గ్రాము మోతాదును ఇస్తే మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయి. పిత్తాశయంలో రాళ్లు కరుగుతాయి. కామెర్లు తగ్గుతాయి. తేనెతో కలిపి ఇచ్చిన ఆయాసం (అస్తమా) తగ్గుతుంది.

సుబ్యము వ్యాధి యందు ఉత్తరేణి వేరును కాల్చిన బూడిదను ఆవ నూనెలో కలిపి పైకి రాసిన సుబ్యము తగ్గుతుంది. 
 

డా.పి.బి.ఏ.వేంకటాచార్య