దేశద్రోహులకు పూర్ణ కుంభంతో స్వాగతం

స్వంత ఇంటిలోకి యజమాని వచ్చినంత స్వేచ్ఛగా అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులు భారతదేశంలోకి యథేచ్ఛగా వస్తున్నారు. తీవ్రవాద కార్యకలాపాలు, దొంగ నోట్ల  పంపిణీ, మాదక ద్రవ్యాల విక్రయం మొదలైన పనులు హాయిగా చేసుకుంటున్నారు. వీరికి రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంటుంది. 'తనియా' (21) అనే బంగ్లాదేశస్తురాలు దిల్సుఖ్ నగర్  ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని దర్జాగా నివసిస్తోంది. అనుమానంతో చుట్టుప్రక్కల వారు సమాచారం అందించగా ఇన్స్ పెక్టర్ పూర్ణచంద్రం 'తనియా'ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండానే భారత్ లోకి ప్రవేశించినట్లు చెప్పింది. బంగ్లాదేశ్ జలకూల్న జిల్లా జోహకూల గ్రామం నుంచి వచ్చిన ఈమె కొన్నాళ్ళు పూణే నగరంలో ఉంది. తరువాత భాగ్యనగరానికి వచ్చినట్లు తనియా తెలియచేసింది. దొరికిన వాళ్ళు సరే ! దొరకని వారు ఇంకా ఎందరెందరున్నారో కదా!

సాక్షి 30.10.2011, పుట - 4
-ధర్మపాలుడు