2011 సంవత్సరం - ఒక సింహావలోకనం

గత సంవత్సరంలో దేశ విదేశాలలో జరిగిన కొన్ని సంఘటనలపై ఒక సింహావలోకనం, విదేశాలలో జరిగినప్పటికిన్నీఅవి మనకు ఆసక్తి దాయకంగా ఉండవచ్చును. అంతరిక్ష ప్రయోగాలలో ముందంజలో ఉన్న భారతదేశం జులై 15 వ తేదీనాడు (2011) పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఇందులో విశేషమేమంటే జులై 15 న ప్రయోగించిన PSLV వరుసగా విజయ వంతమైన 18 వ ప్రయోగం. ఇంకా  సంతోషదాయకమైన విషయం మనం మొత్తంగా 19 పర్యాయాలు ప్రయత్నం చేస్తే 18 సార్లు విజయం సాధించడం. ఒకే ఒక్కసారి అపజయం ఎదురైంది. అంతర్జాతీయ ప్రమాణాలు పరిశీలించినప్పుడు తెలిసినదేమంటే "ఎన్నోసార్లు విఫలం ఐతే తప్ప ఒకసారి విజయం లభించదు". కాని మన అపజయం "శాతం" ప్రపంచంలోనే అతి తక్కువ. మన శాస్త్రవేత్తలకు లోకహితం జేజేలు పలుకుతున్నది. 

ఇక క్లుప్తంగా విశేషాలు  

01/01/2011 : ప్రత్యేక తెలంగాణా సమస్యపై నియమించిన శ్రీకృష్ణ కమిటీ కార్యకలాపాలు అధికారికంగా ముగింపు చేయబడింది. 

02/04/2011 : 2011 వ సంవత్సరం ప్రపంచ క్రికెట్ పోటీలో గెలిచినా భారత్ ప్రపంచ కప్పు కైవసం చేసుకుంది.  

20/05/2011 : శ్రీమతి మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే ఈమె మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. పావుశతాబ్దంపాటు సాగిన కమ్మీల పాలనకు అది చరమగీతం. 

25/05/2011 : ఆఫ్రికా దేశాల అభివృద్ధి కోసం 22500 కోట్లు రూపాయలు భారతదేశం ప్రకటించింది. రెండవ భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశంలో రుణ సహాయం ప్రకటించారు. 

13/06/2011 : ఎప్పటిలాగే ముంబై నగరంలో ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబు ప్రేలుళ్ళు జరిపారు.   

ధర్మపాలుడు