మండుతున్న పెట్రోలు ధరలు

పెట్రోలుకు మండే ధర్మం ఉన్నది. కాని మన దేశంలో పెట్రోలుకంటే దాని ధరలే ఎక్కువగా మండుతున్నాయి. గత ఏడాది ఏప్రియల్ మాసం నుండి ఇప్పటి దాకా చూసుకుంటే వివిధ దేశాలలో పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

పాకిస్తాన్ రూ.48.64 

శ్రీలంక    రూ.61.38

నేపాల్    రూ.65.26

భారత్    రూ.66.42

ఇది కూడా నవంబర్ 16 నాడు తగ్గించిన రూ.2.22 ను లెక్కలోకి తీసుకున్న తర్వాతే. మన దగ్గర నుండి పెట్రోలు దిగుమతి చేసుకుంటున్న నేపాల్ లీటరుకు రూ.65.26 కే వారి ప్రజలకు అందిస్తోంది. మన పెట్రోలు ధర ఇంత ఎక్కువ ఉండడానికి కారణం 45 శాతం పన్నులు. నిజానికి రిఫైనరీ ధర లీటరు పెట్రోలుకు రూ.36.82 మాత్రమే. పై విషయాలు నవంబర్ 23 న పార్లమెంటులో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.యెన్.సింగ్ ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. 

ఈనాడు 24/11/2011 - 5 వ పుట
-ధర్మపాలుడు