విద్యా వినయ సంపన్నే

విద్యా వినయ సంపన్నే |
బ్రాహ్మణే గవి హస్తిని |


శునిచైవ శ్వపాకే చ |
పండితా స్సమదర్శినః ||
 

భావము : విద్యావినయ సంపన్నుడైన ఉత్తమ బ్రాహ్మణునియందు, గోవునందు, ఏనుగునందు, కుక్కయందు, చండాలుని యందు, అన్నిటియందును పండితులు సమదృష్టినే  కలిగి ఉంటున్నారు. అనగా సర్వమునందు బ్రహ్మమును చూచువారే పండితులని అర్థము. 

- భగవద్గీత