కీళ్ళ నొప్పులు మటుమాయం

గృహ వైద్యము - 5


కాలిన గాయాలు :  

  •  కలబంద రసమును కలిన భాగముపై ఆలస్యము లేకుండా వెంటనే లేపనం చేస్తే గాయము మానుతుంది.
  • నేరేడు ఆకులను ముద్దగా నూరి 100 గ్రాముల ముద్దను, 500 గ్రాముల ఆవాల నూనెలో వేయించాలి. ఆ నూనెను కాలిన పుండ్లపై రాస్తూ ఉంటే అవి క్రమంగా సులభంగా మానిపోవును.
  • అవిశె గింజల నూనె 3 భాగములు, ఒక భాగము సున్నపు తేట కలిపి చిక్కగా గిలకొట్టాలి. ఆ మిశ్రమమును కాలిన గాయాలపై లేపనము చేసిన మంట తగ్గడమే కాక క్రమంగా పుండ్లు మానిపోవును.
కాలి పగుళ్ళు : 


చాలామంది కాలి పాదాలు పగిలి, వాటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీటినే కాలి పగుళ్ళు అంటారు. ఇవి తగ్గాలంటే... 
  
  • మర్రిచెట్టు పాలు పగుళ్లపై నిత్యం లేపనం చేస్తూ ఉంటే కాలిపగుళ్ళు మానిపోవును.
  • మామిడి జిగురు లేక బంకను నీళ్ళలో అరగదీసి పగుళ్లపై లేపనము చేసిన అవి క్రమంగా మానిపోవును.
కీళ్ళనొప్పులు - కీళ్ళ వాతము : 

అనేకమంది కీళ్ళ మధ్య నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దీనికి కీళ్ళవాతము కారణం. ఈ కీళ్ళ వాతం తగ్గాలంటే.. 

  • నువ్వుల నూనె మరియు నిమ్మరసము సమభాగములుగా కలిపి కీళ్ళపై మర్దన చేసినచో కీళ్లవాతం తగ్గి క్రమంగా నొప్పులు తగ్గిపోవును.
  • వావిలి వేరు చూర్ణము ఒక గ్రాము, రెండు గ్రాముల నువ్వుల నూనెలో కలిపి రోజుకు రెండు సార్లు తిన్నచో కీళ్ళవాతము, నడుము నొప్పి కూడా తగ్గును.