ఫిబ్రవరి 8 నుండి శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతర

సమ్మక్క - సారలమ్మ జాతర

ప్రపంచంలోనే అతిపెద్ద "గిరిజన" జాతరైన మేడారం శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతరను ఫిబ్రవరి 8, 9, 10, 11 వ తేదీలలో వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తునది. రాష్ట్రం నుండే కాక దేశం నలుమూలల నుండి సుమారు కోటిమంది భక్తులు తమ ఇలవేల్పులను దర్శించుకోవడానికి సంప్రదాయ సిద్ధంగా ఎడ్లబండ్లపై, వాహనాలపై వస్తుంటారు. 13 వ శతాబ్దంలో కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపిన గిరిజన వీర వనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. 1996 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను "స్టేట్ ఫెస్టివల్" గా ప్రకటించింది. ఆదివాసీ గిరిజన సంస్కృతి ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా మేడారం జాతరను నిర్వహిన్స్తూన్తారు. జాతరలో గిరిజన పూజా విధానంతో కోయదొరలు పూజలు నిర్వహిస్తారు. ప్రతి రెండేళ్ళకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజుల్లో జాతరను జరుపుతారు.

- ఆర్.లక్ష్మణ్ సుధాకర్