ఉబ్బసం వ్యాధిని నిరోధించడం ఎలా?

గృహ వైద్యము - 3


ఉబ్బసం (ఆస్తమా) 

కొందరికి చలికాలం వస్తే ఆయాసం వచ్చే స్థితి ఉంటుంది. అది పూర్తిగా తగ్గాలంటే.. 

కుంకుడు గింజ
  • కుంకుడు గింజలోని పప్పును ప్రతిదినం తింటూంటే ఉబ్బస వ్యాధి నిరోధించబడుతుంది. 
  • పరగడుపున కాఫీ కషాయం (బ్లాక్ కాఫీ - పాలు లేకుండా) లేక టీ నిత్యమూ త్రాగుతుంటే ఉబ్బసం హరిస్తుంది. 
  • పరిశుద్ధమైన వేపనూనెను 5 లేక 10 చుక్కలు తమలపాకులో వేసి రోజుకు 2  లేక  3 సార్లు తిన్నచో వారం రోజులలో ఉబ్బసం పోతుంది. 
  • పచ్చి జిల్లేడుపూలు, వాటికి సమానంగా నల్ల మిరియాలు కలిపి మెత్తగా నూరి 400 మి.గ్రా. చొప్పున మాత్రలు చేసి ఎండించాలి. వీటిని పూటకొక మాత్ర చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకొన్నచో ఉబ్బసం నశించును.

ఆకలి తగ్గిపోవుట   

చాలామంది 'ఆకలి లేదు' అంటుంటారు. ఈ 'ఆకలి తగ్గటం' అనేది పోవాలంటే.. 

నేలతాడి గడ్డలు, శొంఠి సమంగా తీసుకొని చూర్ణం చేసి 2 గ్రాముల చొప్పున వేడినీళ్లతోరోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 

కడుపుబ్బరము 

ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య కడుపుబ్బరం లేక గ్యాస్. దీనికి విరుగుడు.. 

సైంధవ లవణం
ఒక గ్రాము సైంధవ లవణం, ఐదు గ్రాముల అల్లం కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తీసుకొంటుంటే కడుపుబ్బరం ఉపశమిస్తుంది. 

ఋతుశూల (ముట్టు నొప్పి) 

చెంగల్వ కోష్టు వేళ్ళను నాలుగు రెట్ల నీళ్లలో వేసి సగం మిగులునట్లుగా కాచి, వడగట్టి 5 చుక్కలు చెవులలో వేసిన ముట్టునొప్పి హరించిపోవును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..