భారతదేశ చిల్లర దుకాణాలను మింగబోతున్న అమెరికా బహుళ జాతి కంపెనీ వాల్-మార్ట్


అమెరికా దేశానికి చెందిన వాల్-మార్ట్ బహుళజాతి కంపెనీని అమెరికా ప్రజలే తన్ని తగలేస్తుంటే, మన ప్రభుత్వం దానికి ఎర్రతివాచీ పరిచి మనదేశంలోకి ఆహ్వానిస్తున్నది. చైనా వస్తువులతో మనదేశాన్ని ముంచెత్తడం ఈ కంపెనీ మాయాజాలం. ఈ వాల్-మార్ట్ కంపెనీ మొదటి దుకాణం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలందుతున్నాయి. ఈ కంపెనీ భారతదేశంలోని చిల్లర వ్యాపారుల మనుగడకు సవాలుగా మారేటట్లుగా ఉంది. ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుతున్న చిల్లర వ్యాపారుల జీవితాల్లో చిచ్చు రే పేటందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా కనబడుతున్నది. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రజలు అప్రమత్తం కావాలని అందరూ హెచ్చరిస్తున్నారు.