గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్న గోమాత

ఆవు (క్లిప్ ఆర్ట్) 

నారాయణ్ ఖేడ్ మండలం గంగాపూర్ లో పదేళ్ళ కిందట ఓ వ్యక్తి ఓ గోవును హనుమాన్ ఆలయం పేరిట వదిలాడు. అది గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నది. వారికి బాగా చేరువైంది. సొంత బిడ్డలా చూసుకునేవారు. ఏ మాత్రం నలతగా కనిపించినా వైద్యం చేయించేవారు. నిత్యం ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి తినిపించి పంపేవారు. 

గోమాత అంత్యక్రియలలో పాల్గొన్నగ్రామస్తులు

ఆ గోమాత ఈమధ్య కన్నుమూసింది. గ్రామస్తులను ఈ సంఘటన కలచివేసింది. శోక సముద్రంలో ముంచింది. గ్రామస్తులంతా కలసి సమష్టిగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. గోమాత పార్ధివ దేహాన్ని ఎద్దుల బండిలో ఉంచి మెడలో పూలమాలలు వేసి భాజాభజంత్రీలు, మేళ తాళాలతో అంతిమయాత్రను నిర్వహించారు. ఘనంగా అంత్యక్రియలు జరిపించారు. ఆ గోమాత పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.