ఎఫ్.డి.ఐ.గా
పిలువబడుతున్న చిన్న వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల విషయంలో
కేంద్రప్రభుత్వం అత్యుత్సాహంపై సుప్రీంకోర్టు నీళ్ళు చల్లింది. "పట్టణాలలో,
గ్రామాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు బెంబేలెత్తిపోతున్నారు.
వారి విషయంలో మీరేమైనా ఆలోచించారా? చిన్న వ్యాపారుల రక్షణకై ప్రత్యేక
చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా?" వెంటనే చెప్పండి, అని జస్టిస్ ఆర్.ఎం.లోథా
నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటీసు ఇచ్చింది.
ప్రజాప్రయోజనాల వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్రానికి కోర్టు నోటీసు ఇస్తూ
మూడు వారాల లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
- ధర్మపాలుడు