కుష్ఠు వ్యాధి నయమవుతుందా?

గృహ వైద్యము - 6


కుష్ఠు వ్యాధి :

కుష్ఠు వ్యాధి ఒక అంటురోగం. దీనిని కూడా నిరంతర ప్రక్రియ ద్వారా పోగొట్టవచ్చును.

వావిలి
వావిలి
  • తెల్ల కరక ఆకులు చూర్ణము చేసి రెండు గ్రాములు ఉదయం, సాయంత్రం గేదె నెయ్యితో తినుచుండిన సమస్త కుష్ఠు రోగములు నశించును. 
  • బావంచాలు, నల్లనువ్వులు సమభాగములుగా కలిపి పూటకు రెండు గ్రాముల చొప్పున మంచినీళ్లతో రెండు పూటలా తీసుకోవాలి. ఇలా కనీసం 40 రోజులు వాడినచో కుష్ఠువ్యాధులు అద్భుతముగా నయమగును. ఈ సమయంలో కేవలం పాలు, అన్నము భుజించవలెను. 
  • వావిలి వేళ్ల చూర్ణమును నువ్వుల నూనెలో నానబెట్టి ఉంచాలి. ఈ ముద్దను ఉదయం సాయంత్రం 2 గ్రాముల చొప్పున లోనికి సేవించాలి. ఇలా చేస్తుంటే 40  రోజులలో ఎముకల కొరకబడినట్టి కుష్ఠురోగం సైతం తగ్గిపోవును.

కోరింత దగ్గు :

కోరింత దగ్గు పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది. దీని నివారణకు... 
  • ప్రశస్తమైన కొబ్బరినూనె పూటకు 1.5 గ్రాముల చొప్పున లోనికి ఇచ్చుచున్న ఎడల పిల్లలలో కలుగు కోరింతదగ్గు ఆశ్చర్యకరంగా తగ్గిపోవును. దానిమ్మ బెరడును చూర్ణము చేసి పూటకు ఒక గ్రాము లోనికి ఇచ్చుచున్న ఎడల పిల్లలలో కోరింతదగ్గు తగ్గిపోవును.

కండ్ల కలక : 
  • పండిన నందివర్ధనం ఆకుల రసమును కండ్లలో వేయుచున్న కండ్ల కలక నశించును. 
  • వంద మిల్లీ లీటర్ల పాలు, రెండు గ్రాముల కరక్కాయ పొడిని కలిపి మరిగించి వడపోసి ఉదయం, సాయంత్రం లోనికి సేవించినచో కండ్ల కలక నయమగును.