సీతారాములను కలుపుతున్న ఎన్.డి.ఎ. ప్రభుత్వం

 
జానకీపురం నేపాల్ లోని ఒక పట్టణం. సీతమ్మవారి బాల్యం ఈ పట్టణంలోనే గడిచింది. భారతదేశంలోని అయోధ్య పట్టణం శ్రీరాముని జన్మస్థలం. ఈ రెండింటినీ కలుపుతూ "జానకీ-రామ మార్గం" నిర్మించబోతున్నది మన కేంద్రప్రభుత్వం. ఈ మార్గం నిర్మాణానికి రెండువేల కోట్ల రూపాయలు వ్యయం కానున్నది. పనులు నాలుగు నెలల్లో మొదలు కాబోతున్నవి. ఈ మార్గానికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం కోసం బయలుదేరినప్పుడు చిత్రకూటం అరణ్యానికి ఈ మార్గం గుండానే ప్రయాణం చేసినట్లు వాల్మీకి వ్యాఖ్య. జనవరి 20, 2015 నాడు అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి గడ్కరీ ఈ విషయాలను ప్రకటించారు. దక్షిణభారతదేశంలోని శ్రీరామసేతువును మన ప్రభుత్వం కాపాడుతుందని, అభివృద్ధి చేస్తుందని కూడా ఆయన అన్నారు.
 
- ధర్మపాలుడు