తిరుపతిలో తెలుగు మహాసభలు


ఔనండీ తెలుగు సభలే! కాకపొతే వాటిని తెలుగు మహాసభలని ప్రభుత్వం వారంటున్నారు. తెలుగు భాషను భూస్థాపితం చేయడానికి అటు ప్రభుత్వం, ఇటు ప్రజలూ కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సమయంలో ఎవరికి పుట్టిన బుద్దో తెలియదు కాని, 27 డిసెంబర్ నుండి మూడు దినాలు తెలుగు సభలు తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించి తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సభలో సదస్యులందరూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారని తెలిసిన విషయమే అయినా ఈ సభలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటో తెలుసా? ఊహించగలరా? తెలుగు సభలో ఉర్దూ కవిసమ్మేళనం ఏర్పాటు చేయడం. హతవిధీ !!!

- ఈనాడు పత్రికలోని వార్త ఆధారంగా..

- ధర్మపాలుడు