నల్గొండ జిల్లాకు తెలుగు పురస్కారం

నల్గొండ జిల్లా
 
జిల్లా వ్యాప్తంగా అన్ని అధికార కార్యకలాపాలు తెలుగులోనే జరుపుతున్న ఏకైక జిల్లాగా నల్గొండ ఎంపిక అయింది. జిల్లా కలెక్టరు ముక్తేశ్వరరావు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ నుండి సంబంధిత ఉత్తర్వులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. నల్గొండకు లోకహితం పత్రిక అభినందనలు పలుకుతున్నది.
 
- ధర్మపాలుడు