అమెరికా న్యాయపీఠంపై భారతీయుడు

భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం 


జన్మత: భారతీయుడైన 46 ఏళ్ల వ్యక్తి అయిన శ్రీ శ్రీనివాసన్ అమెరికాలో రెండవ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొలువుదీరారు. శ్రీ శ్రీనివాసన్ భగవద్గీత సాక్షిగా కొలంబియా జిల్లా అప్పీల్ కోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాలో ఉన్నత న్యాయస్థానాలను అధిరోహించిన భారత సంతతి వ్యక్తులు ఇప్పటికే పలువురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, శ్రీనివాసన్ అమెరికాలో రెండవ అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. శ్రీనివాసన్ చండీగఢ్ లో జన్మించారు. 1970లలో ఆయన తల్లిదండ్రులు అమెరికా వలసవెళ్లారు.