హిందూ నాయకుడు బాలఠాకరే అస్తమయం


హిందువుల ప్రియతమ నాయకుడు శ్రీ బాలకేశవ ఠాకరే (1927-2012) కొంతకాలంగా అస్వస్థులుగా ఉండి 17 నవంబర్ 2012 శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పది మూడు నిమిషాలకు ముంబైలో అంతిమ శ్వాస విడిచారని ప్రకటించడానికి లోకహితం పత్రిక విచారం తెలియచేస్తున్నది. 

శ్రీ బాలఠాకరే అస్తమయం పట్ల తన సంతాపం తెలియచేస్తూ, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా ఈ విధంగా ఒక ప్రకటన జారీ చేశారు. "హిందూ సమాజ హిత రక్షణకై జరిగే కృషిలో శ్రీ ఠాకరే మాకు ప్రేరణదాతగా నిలిచారు. 1992 డిసెంబరులో అయోధ్యలోని వివాదాస్పద కట్టడం నేలమట్టం చేయబడిన సందర్భంలో ఎవరికి వారు బాధ్యత మాది కాదంటే మాది కాదని తప్పించుకోజూస్తున్న సమయంలో కూల్చివేతలో శివసైనికులు పాల్గొన్నారని చెప్తూ అందుకు తానెంతో గర్విస్తున్నానని బాలాసాహెబ్ ధైర్యంగా ప్రకటించారు. 1993లో ముంబైలో వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగినప్పుడు కూడా తురక తీవ్రవాదుల నుండి హిందువులకు రక్షణ కల్పించడంలో బాలాసాహెబ్ ముందున్నారు. శత్రుదేశం పాకిస్థాన్ జట్టు ముంబైలో క్రికెట్టు ఆడకుండా గట్టిగా నిరోధించారు" అని అన్నారు. 


ఛత్రపతి శివాజీ పేరుతో 'శివసేన" అని తన సంస్థకు నామకరణం చేసిన ఠాకరే భవానీమాత వాహనమైన పులిని శివసేన గుర్తుగా పెట్టుకున్నారు. బాలఠాకరే మరణించినా హిందువుల హృదయాలలోచిరంజీవిగానే ఉంటారు.

- ధర్మపాలుడు