ఎబివిపి మాజీ అధ్యక్షులు బాల్ ఆప్టే కన్నుమూత


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ను తీర్చిదిద్దటంలో 1967 వ సంవత్సరం నుంచి ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ బాల్ ఆప్టే ఈ మధ్య స్వర్గస్తులయ్యారు. పరిషత్ వ్యవస్థాపకులైన దత్తోపంత్ థెంగడేజీ నిర్మాణం చేసిన కార్యకర్తల గణంలో బాల్ ఆప్టే ఒకరు. బాల్ ఆప్టే విద్యార్థి పరిషత్ లో కార్యకర్తలను తీర్చిదిద్దటంలో ప్రముఖ పాత్ర పోషించారు. పరిషత్ కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షులుగా పని చేశారు. ముంబై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ గా పని చేసి విశేషమైన ప్రతిభను కనబరిచారు. గృహస్తుగా ఉంటూ దేశమంతా తిరిగి పటిష్టమైన కార్యకర్తల గణాన్ని నిర్మించారు. ఈమధ్య కాలంలో రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు. ఇటువంటి విశేష ప్రతిభా సామర్ధ్యాలు గల ఆప్టేజీ  మరణం ఎంతో తీరని లోటు. వారి ఆత్మకు సంపాదకవర్గం భగవంతుని ప్రార్దిస్తున్నది.