భగవద్గీతను జాతీయ గ్రంథమనడం తప్పా?

 
'కాదేదీ వ్యతిరేకతకనర్హం' అంటారు కొంతమంది జాతీయ వ్యతిరేకవాదులు. ఆకాశం మీద ఉమ్మి వేయాలని ప్రయత్నించడం వీరి అలవాటు. ప్రభుత్వాన్ని విమర్శించటం వీరికి ఎంత అలవాటంటే ప్రభుత్వం ఎంత ఘనమైన కార్యాన్ని చేసినా వీరు విమర్శిస్తారు, తప్పు పడతారు. Opposition for the sake of Opposition అన్నది వీరి విధానం. 
 
శ్రీమద్భగవద్గీత ప్రవచించి నేటికి 5,151 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా క్రొత్త ఢిల్లీలో జరిగిన ఉత్సవంలో పాల్గొంటూ విదేశీవ్యవహారాల మంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్ 'భగవద్గీత'ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని కోరారు. కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా దేశద్రోహులంతా చెలరేగిపోయారు. యావత్ ప్రపపంచంలోనూ శిరోధార్యంగా గౌరవించబడుతూ ఉన్న గీతను వీరు వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇది మరీ విడ్డూరం. దాదాపు 20 దేశాలకు చెందిన విదేశీ ప్రముఖులు పాల్గొన్న ఆ ఉత్సవంలో హైందవేతరులంతా గీతపట్ల గౌరవాన్నీ, భక్తినీ వ్యక్తం చేస్తూంటే, మనవారు (సెక్యులర్ వీరులు) గీతను వ్యతిరేకించటం వారి అజ్ఞానానికి తిరుగులేని నిదర్శనం. భగవద్గీత హిందువులది. ఎంతమంది హిందువులు గీత పఠించారన్న విషయం ప్రక్కన పెడితే, ప్రపంచంలోని ఎందరో మేధావులు, నాయకులు, శాస్త్రవేత్తలు, వైద్యులు భగవద్గీతను పఠించి, అధ్యయనం చేసి స్ఫూర్తిని పొందారు. వారివారి భాషలలోకి అనువదించుకున్నారు. ఒక్కవిషయం ప్రస్తావిస్తే బహుశా చాలామంది ఆశ్చర్యపోతారు. శ్రీమద్భగవద్గీత అరబ్బీ భాషలోకి ఏనాడో అనువదించబడింది. అరబ్బువారు గీతను 'అల్-కితాబ్' అంటారు. 
 
భగవద్గీతలో ఏముంది? విద్య ఉంది, జ్ఞానం ఉంది, స్ఫూర్తి ఉంది, నీతి ఉంది, ధైర్యం ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలుసుకోగలిగే శక్తి ఉండాలికాని అందులో లేనిదేమీ లేదు. హిందూదేశం ద్వారా ప్రపంచమానవాళికి ఇవ్వబడిన విలువ కట్టలేని, వజ్రం వంటి కానుక భగవద్గీత. 
 
తెగిడినా.. పొగిడినా.. గీత ఒక సాటిలేని రత్నం. బైబిలు క్రైస్తవులు చదువుతారు, ఖురాన్ మహమ్మదీయులు చదువుతారు, భగవద్గీతను యావత్ ప్రపంచం చదువుతోంది. దీనికేమంటారు? 
 
- ధర్మపాలుడు