ఆధ్యాత్మికతను అంటిపెట్టుకొనడమే కర్తవ్యం

స్వామి వివేకానంద

స్వామి వివేకానంద

మనం ఆధ్యాత్మికతను అనుసరించకుండా హిందూదేశ పునరు జ్జీవనం అసంభవం. అంతమాత్రమే కాదు, యావత్ప్రపంపచపు శ్రేయస్సు కూడా మనపైనే ఆధారపడియుంది. భౌతిక సుఖములు, తదితరములైన ఇసుక పునాదులపై ఆధారపడిన నాగరికతలన్నీ కూడా స్వల్పకాలికమైన మనుగడతోనే ఈ ధరాతలం నుండి ఒకదానివెంట మరొకటి తుడిచిపెట్టుకుపోయాయి. 

కాని హిందూ నాగరికత, హిందూదేశపు చరణముల మ్రోలనిలచి పాఠములు నేర్చుకొన్న జపాను, చైనా దేశముల నాగరికతలు నేటికీ నిలచియున్నవి. పునరుజ్జీవితమగు సూచనలు కనిపించుచున్నవి. వేయిసార్లు ధ్వంసమొనర్చబడిననూ మరల మరల ఇతోధిక వైభవముతో లేచి నిలబడుటకు వాటి జీవితములు సిద్ధముగా ఉన్నవి. కాని భౌతికవాద నాగరికతలు ఒకసారి విధ్వంసమయ్యెనా, మరల తలెత్తుటయే లేదు.

కావున మిత్రులారా ! ఓరిమి వహించి పూర్వజులైన మహాపురుషులు మనకు బహూకరించిన ఆ ఆధ్యాత్మికతను గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి. అది మన మొదటి కర్తవ్యం.