విద్య పేరుతో మెదళ్ళలో చెత్త నింపుతున్నారు

హితవచనం

పరమ పూజనీయ శ్రీ గురూజీ

మనదేశంలో విద్య యొక్క ఉద్దేశ్యము చాలా ఉన్నతంగా చెప్పబడింది. విద్య వలన మనిషిలో నున్న చిరంతన సత్యతత్వము ఆవిష్కృతము చేయగల సామర్ధ్యము లభించాలి. దానికొరకు కావలసిన గుణవికాసం కలిగి, ప్రపంచవ్యాప్తమైన అనేక ఆవశ్యక విషయాలను గురించిన జ్ఞానము లభించి, వాస్తవ పరిస్థితులకు సంబంధించిన పరిజ్ఞానం తనకున్నదని వ్యక్తి తెలుసుకోగలగాలి. ప్రతివ్యక్తి మన చిరంతన తత్వమును తెలిపే ప్రాథమిక విషయాలు తెలుసుకోగలగాలని మనవారు చెప్పారు. వ్యక్తి యొక్క ఆత్మను ప్రకటించడమే విద్యయొక్క పని. ఈనాడు ఈ అర్థంతో ఎక్కడా విద్య కొనసాగడం లేదు. కేవలం ఏవో రెండు మూడు విషయాలకు సంబంధించిన కొన్ని అంశాలను మాత్రమే వాళ్ల మెదళ్లలో నింపుతున్నారు. అంటే మెదడును చెత్తకుండీ చేస్తున్నారని అర్థం.