మహిళలు నిండుగా దుస్తులు ధరించాలి

కె.జె.ఏసుదాసు
 
తిరువనంతపురం (కేరళ)లో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన లాల్ బహద్దుర్ శాస్త్రి జన్మదినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీగాయకుడు కె.జె.ఏసుదాసు పాల్గొని మాట్లాడుతూ 'మహిళలు జీన్స్ వస్త్రాలు ధరించి ఇతరులకు ఇబ్బంది కలిగించరాదని, నిండుగా దుస్తులు ధరించాలని చెప్పారు. జీన్స్, కురచ దుస్తులు ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధం. నిరాడంబరత, స్నేహభావం స్త్రీల యొక్క గొప్ప సుగుణాలని ఆయన పేర్కొన్నారు.  
 
ఇటీవల పార్లమెంటులో పార్లమెంటు సభ్యుడు, మన తెలుగు పూర్వనటుడు అయిన మాగంటి మురళీమోహన్ కూడా ఇలాగే హితవు చెప్పారు. వీరిని మనం సమర్థించవలసిందే.
 
- ధర్మపాలుడు