మహాభారత పద్యాలు (విదుర నీతి)

సకల పుణ్య కర్మచయమును నొకదెస 
వినుము, పాడి దప్పకునికి యొక్క 


దిక్కు; దీని శ్రుతులు తెలిపెడు నెడం బాడి
కలిమి యెందుం బెద్దగా నుతించె


భావం : రాజా! విను. సృష్టిలో ఉన్న పుణ్య కార్యాలన్నీ ఒక ఎత్తు. న్యాయం తప్పక పోవటం ఒక ఎత్తు. ఈ విషయం ప్రసక్తికి వచ్చినప్పుడు వేదాలు న్యాయాన్ని పాలించుటయే గొప్పదని వేయి నోళ్ళతో కొనియాడాయి.

- తే. 2.67, సం.3.3,4, పు. 58