పట్టణాలలో పెరుగుతున్న ముస్లిం జనాభా


భారతదేశంలో ముస్లింలు నగరాలు, పట్టణాలలో స్థిరపడుతూ పట్టణాల జనాభాలో సమతుల్యతను దెబ్బతీస్తూ తమ ఆధిక్యతను పెంచుకొంటూ పోతున్నారు. పట్టణాలలో వారి జనాభా పెరుగుదల కారణంగా అనేక సమస్యలు కూడా పెరుగుతున్నాయి. పట్టణాలలో కూడా కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఎంపిక చేయబడ్డట్లు స్థిరపడుతున్నారు. భారతదేశంలో (కాశ్మీర్ మినహా) మతకలహాలన్నీ పట్టణాలలోనే జరుగుతున్నాయి, అక్కడ కూడా కొన్ని ప్రత్యేక ప్రదేశాలలోనే అనేది స్పష్టం. మతకలహాలు రెండు అంశాలపై జరుగుతున్నాయి. 1) తమ జనాభా ఆధిక్యతను నిరూపించుకోవటం, 2) అక్కడ మిగిలి ఉన్న హిందువులను భయభ్రాంతులను చేసి అక్కడ నుండి వెళ్లిపోయేటట్లు చూడటం. రెండు దశాబ్దాలకు పూర్వం రాష్ట్ర రాజధానులలో ఇది ఎక్కువగా కనబడేది. ప్రస్తుతం జాగ్రత్తగా గమనిస్తే జిల్లా కేంద్రాలు, చిన్న చిన్న పట్టణాలలో కూడా వారి జనాభా పెరిగిపోతున్నది. ఉదాహరణకు కొన్ని ప్రముఖ పట్టణాలలో ముస్లిం జనాభాను గమనిద్దాం. 

అహ్మదాబాద్             - 11.4%, 
 ఆలీఘర్                  - 17.8%, 
బెంగుళూరు               - 13.4%, 
కోల్కతా                    - 37.5%, 
కటక్                        - 5.2%, 
డిల్లీ                          - 11.7%, 
 హైదరాబాద్                - 41.17%, 
జైపూర్                      - 9.8%, 
లక్నో                        - 20.5%, 
ముంబై                      - 22%, 
ముంబై (సబర్బన్)        - 17.2%.