హిందూ సంస్కృతే నన్ను గెలిపించింది

నీనా దావులూరి
 
"ఇంట ఈగల మోత, బయట పల్లకి మోత" అని ఒక సామెత. స్వదేశంలోఉన్న మనం మహోన్నత సంస్కృతిని 'మతవికారం' అనీ "కాషాయీకరణం' అని తూలనాడుతూ ఉంటే అదే హిందూసంస్కృతి నుండి స్ఫూర్తిపొందిన కొందరు విదేశాలలో అందలం ఎక్కుతున్నారు. విజయవాడలో పుట్టిపెరిగిన దావులూరి నీనా అనే బాలిక ఇప్పుడు అమెరికాలో ఉంటూ "అమెరికా అందాలపోటీ-2014" లో పాల్గొని 'మిస్ అమెరికా-2014' బిరుదును కైవసం చేసుకున్నది. ఇటీవల విజయవాడ వచ్చిన నీనా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన అభిప్రాయాలను ఈ విధంగా తెలియచేసింది -"అందాల పోటీలో గెలవాలంటే ఆత్మవిశ్వాసం చాలా ఉండాలి. హిందూసంస్కృతికి అనుగుణంగా నేను ధరించిన వస్త్రధారణ, చేసిన భరతనాట్యం, పాడిన ఒక హిందీచలనచిత్ర పాట చూసి న్యాయనిర్ణేతలు చాలా సంతుష్టి చెందారు. నా చిన్నతనంలోనే నేను శాస్త్రీయనృత్యం నేర్చుకున్నాను. అమెరికా అందాలపోటీ-2014లో నేను విజయం సాధించటానికి నాలో ఉన్న హిందూసంస్కృతే కారణం" అని అన్నది. 
 
నీనా ఇంత చెప్పిన తరువాత, ఇంకా మన వ్యాఖ్యలు అవసరమంటారా చెప్పండి..!
 
- ధర్మపాలుడు