ఫాస్ట్ ఫుడ్ లను నిషేధించండి

 
పిజ్జాలు, బర్గర్ లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ ను వెంటనే నిషేధించాలని భారతీయ హృద్రోగ వైద్యుల సంఘం (సి.యస్.ఐ.) అధ్యక్షుడు డాక్టర్ పి.చంద్రశేఖరం అంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఫాస్ట్ ఫుడ్ లు అనారోగ్యాన్ని కలిగించి ఊబకాయాన్ని పెంచుతాయని చెప్పారు. వీటిల్లో అధికస్థాయిలో కొలెస్ట్రాల్, క్రొవ్వు, సోడియంలు ఉంటాయని రసాయనిక ప్రిజర్వేటివ్ ల కారణంగా ఇవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు. అమెరికాలో నిషేధించబడిన ఎఱ్ఱకోడిమాంసం (రెడ్ చికెన్) ను దిగుమతి చేసుకుని మనవారు ఆరగిస్తున్నారని కూడా తెలియచేశారు. పాఠశాలలు, కళాశాలల క్యాంటీన్ లలో వీటిని నిషేధించాలని కోరారు.
 
- ధర్మపాలుడు