కసబ్ కు ఉరిశిక్ష అమలయ్యేనా?


ముంబాయి దాడులలో ప్రత్యక్షంగా దొరికిపోయిన కసబ్ కు మహారాష్ట్ర కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును సుప్రీం కోర్టు ఖరారు చేసింది. శిక్ష ఎప్పుడు విధిస్తారో తెలియదు. ఈలోగా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి నివేదించుకోవచ్చు.  అఫ్జల్ గురుకు కూడా ఉరిశిక్ష విధించబడింది. కానీ  ఇప్పటికీ అమలు కాలేదు. ముఖ్యమైన నేరస్థులను శిక్షించడంలో జరుగుచున్న జాప్యం నేర ప్రవృత్తిని పెంచుతున్నదా ? ఆలోచించాలి. అజ్మల్ కసబ్ లాంటి ఉగ్రవాదికి, అందులో ప్రత్యక్షంగా దొరికిపోయిన వాడిని కోర్టులలో విచారణ జరిపేందుకు అయిన ఖర్చు అక్షరాల 35 కోట్లు. అతనికి శిక్ష అమలు చేసేనాటికి ఇంకెంత ఖర్చవుతుందో?