కాంగీ దళారులుగా మీడియా సంస్థలు


మన దేశంలో పత్రికలు, టీవీలకు ఒకటే పని. హిందూ మతాన్ని అప్రతిష్ఠ పాలు చేయడం మరియు దెబ్బతీయడం. ఏదో ఒక సాకుతో నరేంద్ర మోడీని తిట్టకుండా వారికి దినం గడవదు. "ఇప్పుడు కోతికి కొబ్బరికాయ దొరికింది" అన్న చందాన వారికి గడ్కారీ దొరికాడు. నితిన్ గడ్కారీ మంత్రిగా పని చేసినప్పుడు మూడువేల ఆరు వందల కోట్ల టెండరును తిరస్కరించి అదే పనిని వెయ్యి ఎనిమిది వందల కోట్లతోనే (అంటే సగానికి సగం ఖర్చు తగ్గింది) విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి రెండు వేల కోట్లు ఆదా చేసి పెట్టిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి. అతడిని అవినీతిపరుడని నిందిస్తూ కథనాలు వ్రాస్తున్నాయి మీడియా సంస్థలు. వీరిపై క్రిమినల్, సివిల్ వ్యాజ్యాలు వేయబోతున్నట్లు గడ్కారీ ప్రకటించాడు

ఒక పెద్ద మీడియా సంస్థ నల్లదనాన్ని మారిషస్ ద్వారా దారి మళ్ళించిందని, వాటాపత్రాలు తన దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు. దేశాని అల్లుడైన రాబర్ట్ వద్రా గురించి ఈ పత్రికలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

- ఈనాడు పత్రికలోని వార్త ఆధారంగా.. 

- ధర్మపాలుడు