పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిన భారత సైన్యాలు


జమ్మూకాశ్మీర్ లోని ఆర్నియా బెల్ట్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఈ మధ్య పెద్దఎత్తున కాల్పులకు తెగబడుతున్నది. ఈ మధ్య జరిగిన కాల్పులలో ఐదుగురు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఇటువంటి దుశ్చర్యలకు పాకిస్తాన్ సైన్యం తెగబడుతున్నది. సరిహద్దుల నుండి ఉగ్రవాదులను కాశ్మీర్ లో ప్రవేశపెట్టేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నది.

పాకిస్తాన్ ఏర్పడిననాటి నుండీ పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవహారం సరిహద్దులలో ఇలాగే ఉంటూ వస్తున్నది. ప్రత్యక్ష యుద్ధం చేసే సాహసం చెయ్యలేక ఇటువంటి కవ్వింపు చర్యలకు పూనుకొంటూ ఉంటుంది. పాకిస్తాన్ నేతలకు కాశ్మీర్ తప్పించి ఇక ఏ అంశమూ కనబడదు. పాకిస్తాన్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా వాళ్ళకు గుర్తుకు వచ్చేది కాశ్మీరే.

దీనికి దీటుగా నరేంద్రమోడి ప్రభుత్వం నుండి పూర్తి ఆదేశాలను పొందిన మన సరిహద్దు దళాలు పాకిస్తాన్ కు గట్టిగానే బుద్ధిచెప్పాయి. దీంతో దిక్కుతోచక పాకిస్తాన్ సైన్యం, చొరబడబోతున్న ఉగ్రవాదులు పలాయనం చిత్తగించాయి.   


అయితే కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ తన వంకర బుద్ధిని సర్వనాశనం అయ్యేవరకు వదలదలచుకోలేదని మరల ఋజువు చేసుకొంటున్నది. కాని ఇక్కడ ఉన్నది నరేంద్రమోది ప్రభుత్వమని వారు అర్థం చేసుకుంటే ఎన్ని రోజులైన హాయిగా బ్రతికేయవచ్చు.
- రాము