సహకార ఉద్యమం శక్తివంతం కావాలి - మోహన్ భాగవత్


ఇటీవల బెంగుళూరులో సహకార భారతి నాలుగవ మహాసభల సందర్భంగా ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలకులు పూజ్యశ్రీ మోహన్ భాగవత్ మాట్లాడుతూ భారతదేశంలో సహకారోద్యమ విశిష్టత ఆవశ్యకత గురించి సాకల్యంగా వివరించారు. కర్నాటక రాష్ట్రంలో 36,000 సహకార సంఘాలు శక్తివంతంగా పనిచేస్తూ పదహైదు లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నాయి. శ్రీ భాగవత్, సహకార ఉద్యమం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ఉద్యమం మనలను స్వయంసమృద్ధి వంతులుగా, స్వతంత్రులుగా తీర్చి దిద్దుతుందని అన్నారు. ఈ ఉద్యమంలో పని చేసేవారు నిస్వార్థంగా, నిజాయితీతో పనిచేస్తూ ఆర్థిక విషయాలలో ఖచ్చితమైన లెక్కలు వ్రాసి పెట్టుకోవాలని ఆ విధంగా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చెప్పారు.

- ధర్మపాలుడు