మాకైతే బాగుంది ! మీ సంగతి...!


"వంక లేని అమ్మ డొంక పట్టుకుని ఏడ్చింది" అని ఒక సామెత. మోదీ ప్రధానమంత్రి అయి ఇంకా ఏడునెలలు కూడా పూర్తికాకుండానే కొందరు స్వార్థరాజకీయ నాయకులు "మోదీ ఏం చేశాడు, ఏదేదో చేస్తానన్నాడుగా! ఏం ఉద్ధరించాడు, ప్రభుత్వం పనితీరు పేలవంగా ఉంది, ఏమీ ఉపయోగం లేదు" అంటూ రాగాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో "న్యూస్ నేషన్" అనే టివి ఛానెల్ ప్రజలవద్దకు వెళ్ళి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ అభిప్రాయ సేకరణ ఫలితాలు ఇలా ఉన్నాయి. 
  • మోదీ ప్రభుత్వ పనితీరు బాగుంది - 72% 
  • మోదీ ప్రభుత్వం కారణంగా అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ పెరిగింది - 77% 
  • గత ఆరునెలల పనితీరు కారణంగా మోదీపై విశ్వాసం పెరిగింది - 68% 
  • ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో మోదీ పనితీరు బాగుంది - 55% 
  •  దేశవ్యవహారాలమంత్రి రాజ్ నాథ్ సింగ్ పనితీరు బాగుందని అధికసంఖ్యలో చెప్పారు.

అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ లను కూడా ప్రజలు ప్రశంసించారు. అయ్యా ! ఇదీ జనాభిప్రాయం.

- ధర్మపాలుడు