ఒక దేశభక్త సంస్థ కార్యక్రమాన్ని ప్రసారం చేయటం తప్పా..?

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం,
  ఆశ్వీయుజ మాసం

 
విజయదశమి సందర్భంగా నాగపూరులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యక్రమంలో సంఘ సరసంఘచాలకులు మా.శ్రీ మోహన్ రావు భాగవత్ ఉపన్యసించారు. ఆ కార్యక్రమాన్ని ఈసారి కొన్ని ఇంగ్లీషు చానళ్ళు, స్థానిక చానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. దానితోపాటు దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దూదర్శన్ లో పత్ర్యక్ష ప్రసారం చేయటం కాంగ్రెసు నాయకులకు, కమ్యూనిస్టు నాయకులకు కంపరం పుట్టించింది. కరుడుగట్టిన కమ్యూనిస్టువాది రామచంద్రగుహ దూరదర్శన్ ను విమర్శించాడు. ఆ తదుపరి కమ్యూనిస్టు నాయకురాలు శ్రీమతి బృందాకరత్ ఆర్.యస్.యస్. ముందు మోకరిల్లిన దూరదర్శన్ అంటూ నోరు పారేసుకున్నారు. వీరి విమర్శలలో పస లేదు.  
 
పరోక్షంగా ఆర్.ఎస్.ఎస్.ను విమర్శించేందుకు దూరదర్శన్ పేరు అడ్టం పెట్టుకొని ఉంటారు. ఆర్.ఎస్.ఎస్. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థ. ఆర్.ఎస్.ఎస్. మనదేశ ధర్మసంస్కృతుల ఉన్నతి కోసం పనిచేసే దేశంలోనే ఏకైక సంస్థ. ఈ సంస్థ సామాజిక సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నది. దేశానికి సంబంధించిన అన్ని రంగాలలో వివిధ సంస్థల పేరుతో పనిచేస్తున్నది. ఆ సంస్థలన్నింటిని సమన్వయపరిచే పెద్ద దేశం గురించి  ఏం మాట్లాడుతున్నారని దేశమంతా ఎదురుచూస్తుంటుంది. అటువంటి కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రసారం చేయటాన్ని తప్పుపట్టడం కేవలం రాజకీయ, సైద్ధాంతిక వైరం మాత్రమే. వాళ్ళ దృష్టిలో సంఘం హిందూమత సంస్థ. కాని ఈ దేశంలో సుప్రీంకోర్టు నుండి మేధావుల వరకు అందరికి ఇది ఒక జాతీయ సంస్థ. హిందుత్వం అంటే మతమని, అది మైనార్టీలకు వ్యతిరేకమని కమ్యూనిస్టుల వాదన. ఈ వాదన చేయడాదనికి ఏదైనా ఆధారం ఉండాలి. అట్టివేవీ వారివద్ద ఉండవు. సంఘం ప్రారంభించిననాటి నుండి కమ్యూనిస్టులకు ఇదే పని. మరో పెద్ద పని లేదు. సంఘం చేస్తున్నట్లు దేశం కోసం, అట్టడుగు వర్గాల ప్రజల కోసం కమ్యూనిస్టులు ఏం చేసారో చెబితే వినాలని ఉంది. ప్రజలను రెచ్చగొట్టి రొడ్డెక్కించే కమ్యూనిస్టులకు ఇంతకంటే పనేం ఉంటుంది, ఇంతకంటే ఏం తెలుస్తుంది...?