ప్రజాస్వామ్యానికి తలమానికం హిందూ దేశం


భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అత్యంత విజయవంతమైన ప్రజాస్వామ్యం కూడా. ఈశాన్య దిక్కున గల త్రిపుర రాష్ట్రానికి ఫిబ్రవరి 14న జరిగిన ఎన్నికలలో అత్యధికంగా 93శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటర్లు ఉత్సాహంగా ముందుకు రావటం వల్ల ఓటింగు సమయం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. సి.పి.ఎం. అభ్యర్థి మాణిక్ సర్కార్ గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ తడవ కూడా ఆయనే గెలిచే అవకాశం ఉన్నది. ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి ఈ విధంగా గెలుపొందుతూ ఉండడం మన దేశ ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతున్నది.

- ధర్మపాలుడు