చైనాకు 'యోగ' మహాదశ

 
ఒకప్పుడు మన యోగాను చూసి విదేశీయులు నవ్వేవారు. నేడు యోగ విశిష్టత తెలుసుకున్న విదేశీయులు యోగాసనాలు సాధన చేస్తున్నారు. ఇటీవల భారతదేశానికి వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మనదేశ లోక్ సభ అధ్యక్షురాలు సుమిత్రా మహాజన్ తో సంభాషిస్తూ, తన భార్య పెంగ్ లియువాన్ యోగ నేర్చుకుంటున్నట్లు చెప్పారు. నిజానికి బి.కె.యస్. అయ్యంగార్ ద్వారా చైనాకు యోగ వెళ్ళింది. అంతేకాకుండా అయ్యంగార్ కి చైనాలో పౌరసన్మానం కూడా జరిగింది.

'కృణ్వంతో విశ్వమార్యమ్'
 
- ధర్మపాలుడు