ఇటీవల
క్రిమియా, ఉక్రెయిన్, రష్యాలు వార్తలలో తరచు వినపడిన పేర్లు. రష్యా దేశంలో
ఒక ప్రాంతమైన క్రిమియాని గతంలో పాలనా సౌలభ్యం కోసం ఉక్రెయిన్ లో కలిపారు,
అప్పటి నాయకుడు కృశ్చేవ్. ఆనాటికి ఉక్రెయిన్ కూడా రష్యాలో (USSR) ఒక
భాగమే. ఇప్పుడు స్వతంత్ర రాజ్యంగా ఉన్న ఉక్రెయిన్ నుంచి క్రిమియాను తిరిగి
రష్యాలోకి తీసుకునే ప్రయత్నం ఇప్పటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఫుతిన్
చేసినప్పుడు పాశ్చాత్య దేశాలు గగ్గోలు పెట్టాయి. ఆ ప్రయత్నాన్ని
అడ్డుకోజూశాయి. కాని స్వాభిమానం, దేశభక్తి మెండుగా ఉన్న ఫుతిన్ ఎవ్వరికి
భయపడలేదు. కోల్పోయిన భూభాగాన్ని ధైర్యంగా వెనక్కు తెచ్చుకున్నాడు. రష్యా
ప్రజలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. లెవెడా సెంటర్ అనే సంస్థ
నిర్వహించిన సర్వేక్షణలో (సర్వే) 80 శాతానికి పైగా ప్రజలు ఫుతిన్ ను
అభిమానిస్తున్నారు. 64 శాతానికి పైగా మళ్ళీ పుతినే అధ్యక్షుడు కావాలని
కోరుతున్నారు. వీరుడు, ధైర్యవంతుడైన నాయకుడు లభించిన రష్యన్ ప్రజలు ఎంత
అదృష్టవంతులో గదా !
- ధర్మపాలుడు