తమసోమా జ్యోతిర్గమయా...


హిందూ ధర్మమే నిజమైన ధర్మం అని, హిందుత్వం ద్వారా మాత్రమే మోక్షసాధన సాధ్యమని గ్రహించిన 23 మంది వాటికన్ సిటీ వాసులు తమిళనాడు కరువడికుప్పంలోని ఒక వేద పాఠశాలలో హిందూ ధర్మాన్ని స్వీకరించారు.

ఇటలీలోని వాటికన్ సిటీ నుండి వచ్చిన ఈ 23 మందిలో నలుగురు చిన్నారులు ఉండగా మిగిలిన వారందరూ వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు. హిందూ ధర్మ విలువలను తెలుసుకొన్న వీరు హిందూధర్మంలోకి రావాలని నిశ్చయించుకొని తమిళనాడు వచ్చి స్వామి శాస్త్రిగళ్ ఆధ్వర్యంలో పవిత్ర వేద మంత్రాలను పఠిస్తూ శాస్త్రోక్తంగా హిందుత్వాన్ని స్వీకరించారు. వేద మంత్రాలు రుద్రనమకం పలుకుతున్న సమయంలో వీరి స్పష్టమైన ఉచ్ఛారణ ఆశ్చర్యం కలిగించింది. దీక్ష స్వీకరించిన అనంతరం వీరు క్రైస్తవ పేర్లను త్యజించి హిందూ పేర్లను స్వీకరించారు. భారతదేశం పవిత్రమైనది, కర్మ భూమి అని, హిందూ జీవన విధానమే అత్యున్నతమైనదని,  అందుకే క్రైస్తవాన్ని వదిలి హిందుత్వాన్ని స్వీకరించామని 'లలిత' అనే నామాన్ని స్వీకరించిన మహిళ తెలిపారు. 'తమసోమా జ్యోతిర్గమయ' అన్న వేదోక్తిని తమ జీవితంలో సాకారం చేసుకుంటామని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు.

- అయ్యలసోమయాజుల