"దీపావళి
జరుపుకోకండి - ధ్వని కాలుష్యం పెరుగుతుంది. హోళీ పండుగ జరుపుకోవద్దు - అది
అనారికమైన పండుగ. కృష్ణాష్టమి, శ్రీరామ నవమి లాంటి పిచ్చి పిచ్చి
పర్వదినాలకు దూరంగా ఉండండి". ఇటువంటి మాటలు మనం చాలా తరచుగా వింటూ ఉంటాం.
అటువంటిదే వినాయకచవితి. వినాయకచవితి పండుగకు ఒక విశిష్టత ఉంది. యావద్దేశంలో
ఆబాలగోపాలం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. నవరాత్రి ఉత్సవాల తరువాత
వినాయక విగ్రహాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి నదులలో లేదా
చెరువులలో నిమజ్జనం చేయడం మనం సంప్రదాయం.
వినాయకుడిని నిమజ్జనం చేస్తే
నదులు చెఱువులు కలుషితం అవుతాయని, విగ్రహాలకు వాడే రంగులు ప్రమాదకరమైనవనీ
ఇంకా ఎన్నో అభూతకల్పనలతో విషప్రచారం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కొందరు
దేశద్రోహులు. వీరిలో హిందువులు కూడా ఉండడం దురదృష్టకరం. హేతువాదులుగా
చెప్పుకొనేవారు కమ్యూనిస్టులు మరియు వారి ముసుగులో క్రైస్తవ ఏజెంట్లు
జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థల ముసుగులో ఎంతోమంది ద్రోహులు ఎంతోకాలంగా
దుష్ప్రచారం చేస్తూ హిందువులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు.
ఐతే!
మొన్నజరిగిన శాస్త్రీయ పరిశోధన ద్వారా తేలినదేమిటంటే పైన ఉదహరించిన
విషప్రచారం అంతా బూటకం అని. చెరువులు నిజంగా నీటి కాలుష్యానికి
గురవుతున్నాయా? అయితే ఎంత మేర అలా జరుగుతున్నది? అని తెలుసుకోవడానికి
భాగ్యనగరంలోని వినాయక సాగరంలోని అయిదు ప్రదేశాలలో రసాయనిక పరీక్ష
నిర్వహించారు. అదికూడా 1) నిమజ్జనానికి ముందు, 2) నిమజ్జన కార్యక్రమం
జరుగుతున్న సమయంలో, 3) నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తరువాత. ఈ విధంగా మూడు
విడతలుగా ఐదు చోట్ల కూలంకషంగా రసాయనిక పరీక్షలు నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలుషిత నివారణ సంస్థ (ఎ.పి.పొల్యూషన్
కంట్రోల్ బోర్డు), కేంద్ర కలుషిత నివారణ సంస్థ (సెంట్రల్ పొల్యూషన్
కంట్రోల్ బోర్డు) మరియు ఇతర శాస్త్రవేత్తలు పాల్గొని పొల్యూషన్ లెవెల్స్ ను
కొలిచారు. ఈ పరీక్షలు ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 23 వరకు జరిగాయి. PH
లెవెల్స్, Dissolved Oxygen లెవెల్స్ పరీక్షించగా నిమజ్జనానికి ముందు, అటు
తరువాత చాలా కొద్దిమార్పు మాత్రం నమోదయింది. అనగా నిమజ్జనానికి పూర్వం
Chemical Oxygen Demand (COD) 88 నుండి 95 మి.గ్రా. ఉండగా నిమజ్జనం తరువాత
62 నుండి 106 మిల్లీ గ్రాములు ఉన్నాయని తేలింది. కాబట్టి నిమజ్జనం కారణంగా
చెరువులో నీరు కలుషితం కాలేదని, కాలుష్య ప్రచారం అంతా విషప్రచారమేనని
శాస్త్రవేత్తలు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. పరిశ్రమల నుండి వచ్చి చెరువులో
చేరే కాలుష్యాలే ఎక్కువ అని కూడా తేలింది. కాబట్టి ! హిందూ బంధువులారా!
విష ప్రచారానికి బలి కాకండి. హిందూ పండుగలన్నీ లోకకల్యాణానికే కాని,
వినాశనానికి కాదని ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపించబడింది కదా!
- ధర్మపాలుడు